బేబీ బంప్‌ చూపిస్తూ భర్తతో అమలాపాల్‌ రొమాంటిక్‌ గేమ్‌.. ఆ ముద్దులాట చూసి గోలెత్తిపోతున్న కుర్రాళ్లు

First Published | Feb 20, 2024, 10:20 PM IST

అమలా పాల్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది. ఆమె బేబీ బంప్ ని ఎంజాయ్‌ చేస్తుంది. తాజాగా తన భర్తతో కలిసి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ అవుతుంది. 
 

 డస్కీ బ్యూటీ అమలాపాల్‌.. సెకండ్‌ మ్యారేజ్‌ లైఫ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తుంది. ఫస్ట్ పెళ్లిలో మిస్‌ అయిన అన్ని అంశాలను ఇప్పుడు ఎంజాయ్‌ చేస్తుంది. ప్రతి క్షణాన్ని అనుభవిస్తుంది. అనుభూతి పొందుతుంది. పెళ్లి నుంచి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వరకు అమలా పాల్‌ ప్రతి క్షణాన్ని సరదాగా, ఆహ్లాదకరంగా మార్చుకుంటుంది. సపోర్ట్ చేసే భర్త దొరకడంతో లైఫ్‌ని బ్యూటీఫుల్‌గా మార్చుకుంటుంది. 

అమలా పాల్‌ 2014లో దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరికి పడలేదు. బేధాభిప్రాయాల కారణంగా విడిపోయారు. ఇంత కాలం సింగిల్‌గానే ఉంది అమలా పాల్‌. కానీ ఇటీవలే తాను రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ వ్యాపార వేత్త జగత్‌ అనే వ్యక్తిని గతేడాది మ్యారేజ్‌ చేసుకుంది. అక్టోబర్‌లో ప్రియుడిని పరిచయం చేసింది. నవంబర్‌ మొదటి వారంలో మ్యారేజ్‌ చేసుకుంది. జనవరి మొదటి వారంలో తమ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. 
 


ఆ తర్వాత నుంచి బేబీ బంప్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది అమలా పాల్‌. భర్తతో కలిసిదిగిన పిక్స్ ని, బీచ్‌ వద్ద ఎంజాయ్‌ చేస్తున్న పిక్స్ ని షేర్‌ చేసింది. తన లైఫ్‌లో ప్రతి మూమెంట్‌ని ఫోటోలు, వీడియో రూపంలో బంధించి వాటిని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె మరోసారి తన భర్త జగత్‌తో సరదాగా రొమాంటిక్‌ డేట్‌లో ఉన్న వీడియోని షేర్‌ చేసింది. 
 

ఇందులో ఇద్దరు కలిసి ఫోన్‌లో ఏదో చూస్తున్నారు. అంతలోనే జగత్‌ తన భార్యపై ప్రేమని చూపించడం ప్రారంభించాడు. ముద్దులతో రెచ్చిపోయాడు. బేబీ బంప్‌ని చూసి ఆ అనుభూతిని పొందుతున్నాడు. భార్య ఒళ్లు వాలిపోతున్నారు. దీంతో చివరికి తన భర్తని దగ్గర తీసుకుని ముద్దుల వర్షం కురిపించింది అమలా పాల్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

amala paul sreenish

ఇందులో బేబీ బంప్‌లో అమలా పాల్‌ ఎంతో అందంగా ఉంది. డస్కీ బ్యూటీ నేచురల్‌ అందం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీనికితోడు తన భర్తతో కలిసి ఆమె రొమాంటిక్‌ డేట్‌ని ఎంజాయ్‌ చేస్తున్న తీరు అలరించేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలో వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. కాస్త ఆగండి అని, ఇది సోషల్‌ మీడియా మీ ఇల్లు కాదని, డస్కీ బ్యూటీ దూకుడు నెక్ట్స్ లెవల్ అని, ఇలా రకరకాల కామెంట్లతో గోలగోల చేస్తున్నారు కుర్రాళ్లు. 

ఇదిలా ఉంటే అమలా పాల్‌ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అయ్యిందనే రూమర్లు వచ్చాయి. నవంబర్‌ మొదటి వారంలో పెళ్లి అయితే జనవరి మొదటి వారంలో ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో అనేక మంది డౌట్‌ని వ్యక్తం చేశారు. ప్రెగ్నెన్సీ అయ్యాకనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే కామెంట్‌ చేశారు. కానీ అవేవీ పట్టించుకోకుండా తమ లైఫ్‌ని బ్యూటీఫుల్‌గా మార్చుకుంటున్నారీ జంట. 

అమలా పాల్‌ తెలుగులో నాలుగైదు సినిమాలు చేస్తుంది. `జెండా పైకపిరాజు`, `బెజవాడ`, `ఇద్దరమ్మాయిలతో`, `నాయక్‌` వంటి సినిమాల్లో నటించింది. చాలా గ్యాప్‌ ఇచ్చింది. ఇటీవల `పిట్టకథలు` అనే ఓటీటీ మూవీ చేసింది. మళ్లీ తమిళంకే పరిమితమయ్యిందీ మలయాళ సోయగం. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది అమలా పాల్‌.  

Latest Videos

click me!