బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. పలు షాకింగ్ విషయాలను రివీల్ చేస్తోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ 2` మూవీ మరో వారంలో విడుదల కాబోతుంది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త సినిమాని ప్రారంభించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `వీరసింహారెడ్డి` వంటి విజయవంతమైన సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. `ఎన్బీకే111` వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా నేడు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
25
నయనతారతో నాల్గో సారి బాలయ్య రొమాన్స్
ఇందులో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. `శ్రీరామరాజ్యం`, `సింహ`, `జై సింహా` వంటి చిత్రాల తర్వాత బాలయ్య, నయనతార కలిసి నటిస్తోన్న చిత్రమిది. వీరి కాంబినేషన్‌లో దాదాపు అన్ని చిత్రాలు విజయం సాధించాయి. `జై సింహా`నే ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. పైగా కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటేనే నయనతార సినిమాలు చేస్తుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
35
గ్రాండ్‌గా ప్రారంభమైన ఎన్బీకే 111 మూవీ
బుధవారం గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ మూవీకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు దర్శకత్వం వహించారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీని హిస్టారికల్ కథాంశంతో రూపొందిస్తున్నారు. ఆయన మొదటిసారి ఇలాంటి హిస్టారికల్ కథతో రాబోతుండటం విశేషం. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఎన్బీకే111 వర్కింగ్ టైటిల్‌తో ఈ లుక్ ఉంది. ఇందులో బాలయ్య రెండు గెటప్స్ లో ఉన్నారు. ఓ లుక్‌లో యోధుడిగా కనిపిస్తున్నారు, మరో లుక్‌లో రాజులా కనిపిస్తున్నారు. బాలయ్య రాజుగా పలు సినిమాలు చేశారు. కానీ యోధుడిగా మొదటిసారి కనిపిస్తున్నారు. ఆయన లుక్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
55
ద్విపాత్రాభినయం చేస్తోన్న బాలయ్య
కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ రూపొందించే తన ప్రత్యేక మాస్ టచ్‌ను ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ, నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్ చూపించబోతున్నారట దర్శకుడు. స్పెషల్ పోస్టర్‌లో బాలకృష్ణ ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో యాంకర్ పట్టుకుని తిరుగులేని రాజసంతో కనిపించారు. గడ్డం, పొడవాటి జుట్టు, శక్తివంతమైన తీరుతో సమరశూరుడిలా అదరగొట్టారు. అదే సమయంలో ఈ పోస్టర్‌లో కోట, సముద్రం మెయిన్‌గా కనిపిస్తున్నాయి. ఇందులో బాలయ్య హీరోగా, విలన్‌గా కనిపించబోతున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, యాక్షన్, విజువల్ వండర్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోందని టీమ్ చెప్పడం విశేషం.