బాలకృష్ణ, నాగ్‌, రానా, విజయ్‌ దేవరకొండ.. `బిగ్‌ బాస్‌ 7` హోస్ట్ ఎవరో తేలిపోయింది..? అదే ట్విస్ట్

Published : Jun 20, 2023, 08:31 PM IST

`బిగ్‌ బాస్‌ 7` సీజన్‌కి హోస్ట్ గా బాలకృష్ణ, నాగార్జున, రానా, విజయ్‌ దేవరకొండల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరనే ఫైనల్‌ అనేది సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో ఆ స్టార్‌ పేరు బలంగా వినిపిస్తుంది.

PREV
17
బాలకృష్ణ, నాగ్‌, రానా, విజయ్‌ దేవరకొండ.. `బిగ్‌ బాస్‌ 7` హోస్ట్ ఎవరో తేలిపోయింది..? అదే ట్విస్ట్

బుల్లితెర రియాలిటీ షో `బిగ్‌ బాస్‌`కి అన్ని భాషల్లో మంచి ఆదరణ దక్కుతుంది. తెలుగులో ప్రారంభంలో బాగుంది. కానీ తర్వాత ఆ క్రేజ్‌ తగ్గుతూ వస్తోంది. గత సీజన్‌ విషయంలో మాత్రం చాలా విమర్శలు వచ్చాయి. చప్పగా సాగిందంటూ కామెంట్లు వచ్చాయి. ఆడియెన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యింది. దీనికి కారణం గుర్తింపు లేని కంటెస్టెంట్లు కావడం ఓ కారణమైతే, హోస్ట్ నాగార్జున కూడా మోనోటనీ అయిపోయిందనేది మరో కారణం. హోస్ట్ గా నాగ్‌ సరిగా చేయలేదనే కామెంట్లు బలంగా వినిపించాయి. 
 

27

ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ `బిగ్‌ బాస్‌ 7`కి హోస్ట్ ని మారుస్తున్నారని, నాగార్జున తప్పుకుంటున్నారనే వార్తలొచ్చాయి. నిజానికి `బిగ్‌ బాస్‌ 6` సీజన్‌ ఎండింగ్‌లోనే ఈ కామెంట్లు వచ్చాయి. నాగార్జునే ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు ప్రచారమయ్యాయి. ఆడియెన్స్ నుంచి కూడా నాగ్‌ హోస్ట్ గా మోనోటనీ అనిపిస్తుందనే కామెంట్లు వచ్చినా నేపథ్యంలో బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా హోస్ట్ ని మార్చే ఆలోచనకు వచ్చారని సమాచారం. 
 

37

నాగార్జున స్థానంలో రానా పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. రౌడీబాయ్‌ హోస్ట్ గా చేస్తే షో క్రేజీగా ఉంటుందన్నారు. వీరిద్దరు కాకుండా ఇక బాలయ్య పేరు హోస్ట్ గా వినిపించింది. బాలకృష్ణ `ఆహా`లో చేసిన `అన్‌స్టాపబుల్‌` షోకి విశేష ఆదరణ లభించింది. అంతేకాదు దాన్ని ఇండియాలోనే నెంబర్‌ వన్‌ షోగా నిలిపారు. ఓ స్టార్‌ హీరో, సీనియర్‌ హీరో షోకి హోస్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ చూపించాడు బాలయ్య. పైగా ఆయన గతంలో ఎప్పుడూ టీవీ షోలో కనిపించింది లేదు.
 

47

 దీంతో `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షోకి విశేష ఆధారణ దక్కింది. బాలయ్య అంటే కోపిష్టి, కొడతాడు, సీరియస్‌గా ఉంటాడనే ప్రచారం జనాల్లో ఉంది. కానీ ఈ టీవీ షోలో ఆయన భిన్నంగా సరదాగా ఉంటూ, జోకులేస్తూ నవ్విస్తూ, క్రేజీగా చేయడంతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ షో క్లిక్‌ అయ్యింది. దీంతో బాలకృష్ణని `బిగ్‌ బాస్‌7`కి హోస్ట్ గా తీసుకుంటున్నారనే వార్తలొచ్చాయి. 
 

57

కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు, బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఆలోచనల మేరకు ఏడో సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్ గా ఉంటారని తెలుస్తుంది. హోస్ట్ లో మార్పు ఉండటం లేదని సమాచారం. నాగార్జునే హోస్ట్ గా కంటిన్యూ అవుతారని తెలుస్తుంది. నాగ్‌ కూడా ఈ షో చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన చేతిలో ఇప్పుడు సినిమాలు లేవు. ప్రసన్నకుమార్‌తో ఓ సినిమా అనుకున్నారు, అది ఎప్పుడు అవుతుందో క్లారిటీ లేదు. చేస్తే ఓ సినిమా చేస్తారు నాగ్‌. 

67

కాబట్టి బిగ్‌ బాస్‌కి కావాల్సిన టైమ్‌ నాగ్‌ ఇవ్వగలరు. ఆయన కూడా రిలాక్స్ గా ఈ షో చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సారి మాత్రం రచ్చ రచ్చ చేసేందుకు నాగ్‌ సిద్ధమవుతున్నారట. గత విమర్శలకు చెక్‌ పెట్టేలా సరికొత్తగా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ లెక్కన ప్రస్తుతానికి బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌కి హోస్ట్ లో మార్పు ఉండబోతుందని తెలుస్తుంది. కాకపోతే షో ప్రారంభమవడానికి చాలా టైమ్‌ ఉంది. ఈ లోపు ఎన్ని లెక్కలైనా మారొచ్చు. ఏమైనా జరగొచ్చు. 
 

77

ఇక బిగ్‌ బాస్‌ 7 సీజన్‌కి సంబంధించి కంటెస్టెంట్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో అమ‌ర్ దీప్ అత‌ని భార్య‌, యాంక‌ర్ దీపికా పిల్లి, యూట్యూబ‌ర్ నిఖిల్‌, న‌టి ఐశ్వ‌ర్య‌, సింగ‌ర్ హేమ చంద్ర‌, డ్యాన్స‌ర్ శ్వేత నాయుడు, న‌టి మిత్రా శ‌ర్మ‌, న‌టి శోభ శెట్టి, ట్రాన్స్‌జెండ‌ర్ త‌న్మ‌యి, మోడ‌ల్ సాయి రోన‌క్, న్యూస్‌ రీడర్‌ ప్రత్యూష, సింగర్‌ హోహన భోగరాజు, యాంకర్‌ రష్మి, సింగర్‌ మంగ్లీ, కామన్‌ మ్యాన్‌ పల్లవి ప్రశాంత్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఇటీవల వివాదాలకు కేరాఫ్‌ గా నిలుస్తున్న జర్నలిస్ట్ సురేష్‌ కొండేటి పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories