`త్రిమూర్తులు` సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కలిసి కనిపించడం విశేషం. కాకపోతే జస్ట్ గెస్ట్ రోల్స్ చేశారు. ఇది వెంకటేష్ హీరోగా రూపొందిన మూవీ. అర్జున్, రాజేంద్రప్రసాద్ మిగతా హీరోలు. కె మురళీ మోహనరావు దర్శకత్వం వహించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలంతా, హీరోయిన్లంతా కలిసి కనిపించారు. ఓ సీన్ కోసం ఇండస్ట్రీని దించారు దర్శకుడు. అలా చిరంజీవి, బాలయ్య, నాగార్జునతోపాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్‌బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు.