సన్నీ లియోన్‌ అంటూ దారుణంగా టీజ్‌ చేశారు.. అందుకే పేరు మార్చుకున్నా.. అడివి శేష్‌ వ్యాఖ్యలు..

First Published Jun 22, 2024, 8:54 PM IST

సన్నీలియోన్‌ అంటూ ఆటపట్టించిన స్నేహితులు. ఆ బాధ భరించలేక పేరు మార్చుకున్న అడివి శేష్‌. మరి తన పేరు వెనుక కథేంటి? సన్నీలియోన్‌తో లింకేంటి?
 

అడివి శేష్‌ తెలుగు హీరోల్లో అత్యంత టాలెంటెడ్‌ హీరో. తనని తాను హీరోగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ, కథలో, సినిమా షూటింగ్‌లో ఇన్‌వాల్వ్ అవుతూ బెటర్‌ ఔట్‌పుట్‌ కోసం శ్రమిస్తుంటాడు. కొడితే హిట్‌ కొట్టాల్సిందే అనే టార్గెట్‌తో ఆయన సినిమాలు చేస్తుంటాడు. అలా దర్శకుడిగా ప్రయోగాలు చేసి దెబ్బలు తిని ఇక్కడి వరకు వచ్చాడు. టాలీవుడ్‌ టైర్‌ 2 హీరోల్లో ఒకడిగా నిలిచాడు. తన ఇమేజ్‌, మార్కెట్‌ పెంచుకునే పనిలో ప్రస్తుతం రెండు డిఫరెంట్‌ మూవీస్‌ చేస్తున్నాడు. 
 

ఇదిలా ఉంటే అడవి శేష్‌.. పేరుకి సంబంధించిన ప్రస్తావన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. సన్నీలియోన్‌కి ఆయనకు పేరుకి ఉన్న సంబంధం ఏంటనేది హాట్‌ టాపిక్‌ గా మారింది. అడివి శేష్‌ తన పేరుని ఎందుకు మార్చుకున్నాడు. ఫ్రెండ్స్ ఎందుకు టీజ్‌ చేశారనేది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగింది. అడివి శేష్‌ అసలు పేరేంటి? ఇప్పుడు అడివి శేష్‌గా పెట్టుకోవడానికి కారణమేంటనేది ఆసక్తికరంగా మారింది. 
 

Latest Videos


ఆ వివరాల్లోకి వెళిలే.. అడివి శేష్‌ అసలు పేరు.. `అడివి శేష్‌ సన్నీ చంద్ర`. కానీ ఆయన సన్నీ చంద్రగా పెట్టుకున్నాడు. అలానే ప్రచారంలోకి వచ్చింది. కానీ తాను కాలేజ్‌ చదివే రోజుల్లో సన్నీలియోన్‌ పేరు బాగా వినిపించింది. ఆమె పోర్న్ సినిమాల గురించి బాగా చర్చజరిగింది. అవి బాగా మార్కెట్‌లోకి రావడంతో యూత్‌లో డిస్కషన్‌ పాయింట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అడివి శేష్‌ ఫ్రెండ్స్ తన పేరుని `సన్నీ చంద్రని కాస్త సన్నీ లియోన్‌గా మార్చేశారట. ఎక్కడ కనిపించినా, సన్నీలియోన్‌ అంటూ పిలిచేవారట. అలా బాగా టీజింగ్‌ చేసేవాళ్లట. 
 

దీంతో ఆ బాధ భరించలేక తన పేరులోని సన్నీ చంద్ర అనే పేరుని తొలగించుకున్నాడట. దీంతో తన పేరులోని మొదటి రెండు పదాలనే తన అసలు పేరుగా మార్చుకున్నారట. అలా సన్నీ చంద్ర కాస్త అడివి శేష్‌ గా మారిపోయాడు. అయితే మొదట్లో శేష్‌ అనే పదం లేదని, ఆ తర్వాతనే దాన్ని యాడ్‌ చేసుకున్నట్టు ఇటీవల అడవి శేష్‌ వెల్లడించారు. ఇది నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

అడివి శేష్‌ 2002లో `సొంతం` మూవీలో చిన్న పాత్రలో మెరిశాడు. ఆ తర్వాత కొన్నాళ్ల గ్యాప్‌ తర్వాత `కర్మ` చిత్రంతో హీరోగా పరిచయంఅయ్యాడు. దీనికి తనే దర్శకుడు కావడం విశేషం. ఈ మూవీ ఆడలేదు. పెద్ద దెబ్బకొట్టింది. ఈ లోపు నటుడిగా ఆఫర్లు వచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ `పంజా`లో విలన్‌గా చేశాడు. `బలుపు`లోనూ కీలక పాత్రలో నటించాడు. `కిస్‌` చిత్రంతో మరోసారి దర్శకుడిగా ప్రయత్నం చేయగా మళ్లీ విఫలమయ్యాడు. ఇక దర్శకత్వం పక్కన పెట్టి నటుడిగా రాణించాడు. `బాహుబలి`తో పేరు తెచ్చుకున్నాడు.

`క్షణం` మూవీతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. వరుసగా విజయాలతో ఆకట్టుకుంటున్నాడు. తన ఇమేజ్‌ని పెంచుకుంటున్నాడు. హీరోగా ఫెయిల్యూర్‌ అనేదే లేకుండా రాణిస్తున్నాడు. తనే స్క్రిప్ట్ లో భాగమవుతూ పక్కాగా సినిమాని డిజైన్‌ చేసుకుంటూ హిట్‌ కొడుతున్నాడు. `గూఢచారి 2`, `డెకాయిట్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాదైనా వస్తాయా? అనేది చూడాలి. 

click me!