శ్రీజ.. శిరీష్‌ భరద్వాజ్‌ని పెళ్లిచేసుకున్నాక చిరంజీవి ఫస్ట్ రియాక్షన్‌.. అది కదా మెగాస్టార్‌ అంటే?

Published : Jun 22, 2024, 07:19 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. శిరీజ్‌ భరద్వాజ్‌ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి ఫస్ట్ టైమ్‌ రియాక్షన్‌ అయిన వీడియో వైరల్‌ అవుతుంది.  

PREV
17
శ్రీజ.. శిరీష్‌ భరద్వాజ్‌ని పెళ్లిచేసుకున్నాక చిరంజీవి ఫస్ట్ రియాక్షన్‌.. అది కదా మెగాస్టార్‌ అంటే?

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. లేచిపోయి తన క్లాస్‌ మేట్‌ శిరీష్‌ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్‌లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అది పెద్ద సంచలనం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమకి మెగాస్టార్‌ అయిన చిరంజీవి కూతురు ఇలా చేయడంతో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు తనకు ఫ్యామిలీ నుంచి థ్రెట్‌ ఉందని చెప్పి శ్రీజ కూడా కంప్లెయింట్‌ చేయడంతో ఇది మరింత దుమారం రేపింది. 
 

27

ఈ ఘటనతో మెగాస్టార్‌ తోపాటు ఆయన ఫ్యామిలీ కూడా డిజప్పాయింట్‌ అయ్యారు. చాలా బాధపడ్డారు. కుంగిపోయారు. ఇంట్లో అమ్మాయి, కన్న కూతురు ఇలా చేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది. ఇరవై ఏళ్లు ఎంతో గారాభంగా, అల్లారు ముద్దుగా పెంచిన చేతులు కావడంతో ఆ మానసిక క్షోభ అనుభవిస్తారు. ఈ క్రమంలో కొంత ఆవేశానికి కూడా గురి కావడం సహజమే. చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. 

37

అయితే ఈ ఘటన జరిగిన తర్వాత చిరంజీవి తొలిసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. కూతురు చేసిన ఘటన గురించి తన మనోభావాన్ని వెల్లడించారు. శ్రీజ చేసిన పని తమకు షాక్‌కి గురి చేసిందని, జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. పేరెంట్స్ గా ఆ బాధ తమకు ఉంటుందని వెల్లడించారు చిరంజీవి. అమ్మ శ్రీజ నువ్వు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. 
 

47

`పిల్లల ఇష్టాఇష్టాలకు మేము ఎప్పుడూ విలువనిచ్చేవాళ్లమే. అయితే మేజర్ అయిన శ్రీజ సడెన్‌గా తీసుకున్న నిర్ణయానికి మేం అంతా షాక్‌ అయిన మాట నిజమే. కానీ వాస్తవంలోకి వచ్చి ఆలోచించిన తర్వాత శ్రీజ సుఖ సంతోషాలే మాకు ప్రధానం. అదే మాకు ముఖ్యం. మా కుటుంబ సభ్యులందరు అదే కోరుకుంటున్నారు. అమ్మ శ్రీజ నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి. నీ సంతోషమే మా సంతోషం. ఈ సంఘటన పట్ల ఆవేదన చెందిన నా శ్రేయోభిలాషులను ఒక్కటే కోరుకుంటున్నాను. మీ ఆశిస్సులు నా బిడ్డకి కావాలి. అదే ఆమెకి శ్రీరామ రక్ష` అని వీడియో విడుదల చేశారు చిరంజీవి. 
 

57

16ఏళ్ల క్రితం నాటి ఈ అరుదైన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం విశేషం. ఇటీవల శ్రీజ మొదటి భర్త శిరీష్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీడియోని వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. 
 

67

శిరీష్‌ భరద్వాజ్‌.. శ్రీజ క్లాస్‌ మేట్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. పెళ్లికి దారితీసింది. ఇంట్లో చెబితే ఒప్పుకోరని భావించి ఇద్దరు లేచిపోయి వివాహం చేసుకున్నారు. ఆర్య సమాజంలో 2007లో మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇంట్లో చెప్పినా ఒప్పుకోలేదని, దీంతో లేచిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి తనకు థ్రెట్‌ ఉందని వెల్లడించారు. అనంతరం చిరంజీవి ఈ వీడియో విడుదల చేయడం విశేషం. 
 

77
Sreeja-Kalyan Dev

ఈ ఇద్దరు నాలుగేళ్లు కలిసి ఉన్నారు. వీరికి కూతురు కూడా జన్మించింది. కానీ శిరీష్‌ తనని బాగా హింసించాడని చెబుతూ విడాకులు తీసుకుంది శ్రీజ. చిరంజీవి ఇంటికి చేరుకుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ కళ్యాణ్‌ దేవ్‌తో రెండో వివాహం చేశారు. వీరికి ఓ కూతురు జన్మించింది. కానీ ఈ ఇద్దరు కూడా విడిపోయారు. ఇప్పుడు ఇద్దరు విడిగానే ఉంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories