జూ ఎన్టీఆర్‌ ప్రస్తావన రావద్దు అంటూ బాలయ్య కండీషన్‌? అన్‌స్టాపబుల్‌ షో గెస్ట్ లకు ముందే సూచన, ఇంత పగేంటి?

First Published | Jan 4, 2025, 7:20 AM IST

జూ ఎన్టీఆర్‌ని తొక్కేసే ప్రయత్నం గట్టిగా జరుగుతుందా? ఆయన ప్రస్తావన రాకుండా బాబాయ్‌ బాలయ్య `ఆహా` వాళ్లకి వార్నింగ్‌ ఇచ్చాడా? లేటేస్ట్ లీక్‌ వార్తలు షాకిస్తున్నాయి. 
 

Balakrishna

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న షో `అన్‌ స్టాపబుల్‌`. ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ `ఆహా` వేదికగా ఈ షో రన్‌ అవుతుంది. ఇప్పటికే నాలుగేళ్లుగా ఈ షో రన్‌ అవుతుంది. ప్రస్తుతం నాల్గో సీజన్‌ రన్‌ అవుతుంది. ఇందులోకి సీఎం చంద్రబాబు నాయుడు, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, నాని, శర్వానంద్‌, సూర్య, దుల్కర్‌ సల్మాన్‌, గోపీచంద్‌, నవీన్‌ పొలిశెట్టి, శ్రీలీల, విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ వంటి చాలా మంది స్టార్స్ వచ్చారు. రామ్‌ చరణ్ ఎపిసోడ్‌ వచ్చే వారం టెలికాస్ట్ కాబోతుంది. 
 

పెద్ద హీరోలలో ఈ షోకి రాని వారిలో చిరంజీవి, ఎన్టీఆర్‌, నాగార్జున రాలేదు. బాలకృష్ణ తనదైన స్పెషాలిటీతో ఈ షోని రక్తికట్టిస్తున్నారు. ఆద్యంతం అలరించేలా హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకి ఇండియాలోనే క్రేజ్‌, పాపులారిటీ వచ్చింది. అత్యధిక వ్యూస్‌ వస్తున్న షోగానూ నిలిచింది. అన్ని రకాల టాక్‌ షోల రికార్డులను బ్రేక్‌ చేసిందీ షో. అత్యంత విజయవంతంగా రన్‌ అవుతుంది.

read more: బ్రాహ్మణికి స్టార్ డైరక్టర్ నుంచి సినిమా ఆఫర్..స్వయంగా చెప్పిన బాలయ్య
 


అయితే ఈ షోకి సంబంధించిన ప్రారంభం నుంచి బాలయ్య ఓ కండీషన్‌ పెట్టాడట. షోలో జూ ఎన్టీఆర్‌ ప్రస్తావన ఎట్టిపరిస్థితుల్లోనూ రానివ్వకూడదని తెగేసి చెప్పాడట బాలయ్య. సీజన్‌ ప్రారంభం నుంచి ఆయన `ఆహా` నిర్వహకులకు స్ట్రాంగ్‌ చెప్పిన మాట ఇదే అని తెలుస్తుంది.

తాజాగా ఈ విషయం లీక్‌ అయ్యింది. దర్శకుడు బాబీ ఎపిసోడ్‌లో ఈ విషయం స్పష్టమైంది. తాజాగా `డాకు మహారాజ్‌` టీమ్‌ ఈ షోలో పాల్గొంది. ఇందులో భాగంగా బాబీ తాను పని చేసిన హీరోల గురించి అనుభవాలను చెప్పుకొచ్చాడు. 
 

ఈ క్రమంలో ఆయన రవితేజ, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ పేర్లు మాత్రమే చెప్పారు. ఎన్టీఆర్‌ పేరు చెప్పలేదు. ఆయన తారక్‌తో `జైలవకుశ` సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు హీరోల గురించి చెప్పి తారక్‌ పేరుని స్కిప్‌ చేశారు. ఇది ముందుగానే ఆయనకు చెప్పారట. తారక్‌ పేరు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదని, దీంతో ఆయన ఈ విషయాన్ని స్కిప్‌ చేశారు.

also read: రాసిపెట్టుకోండి `సమరసింహారెడ్డి` సంచలనం రీ క్రియేట్‌ అవుతుంది.. ట్రోలర్స్ కి `డాకుమహారాజ్‌` నిర్మాత కౌంటర్‌
 

ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. గతంలో వంశీ ఎపిసోడ్‌లోనూ ఆయన తారక్‌ పేరుని ప్రస్తావించలేదు. అంతేకాదు ఈ నాలుగు సీజన్లలో ఎన్టీఆర్‌ గురించిన ప్రశ్నలు గానీ లేవు. అదే సమయంలో ఏవీలలోనూ ఆయన ప్రస్తావన రాకుడదని కూడా చెప్పారట. అందుకే `ఆహా`వాళ్లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారని, జూ ఎన్టీఆర్‌ పేరుని ప్రస్తావించకుండా గెస్ట్ లకు ముందుగానే సూచన చేస్తున్నారని తెలుస్తుంది. 

balakrishna ntr

జూ ఎన్టీఆర్‌కి, బాలయ్యకి చాలా కాలంగా పడటం లేదు. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో తారక్‌ స్పందించలేదని, దీంతో అటు చంద్రబాబు ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ బాగా హర్ట్ అయ్యిందని, అందుకే ఆయన్ని స్కిప్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. తమ ఫ్యామిలీ వ్యవహారాల్లోనూ ఎన్టీఆర్‌ని దూరం పెడుతున్నారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో లేటెస్ట్ వార్త కూడా షాకిస్తుంది. బాలయ్య పనిగట్టుకుని తారక్‌ని దూరం పెడుతున్నాడని అంతా కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ని ఎవరు ఏం చేయలేరని, ఆయన పాన్‌ ఇండియా స్టార్ అని, ఆయనకు ఎవరి ఎలివేషన్లు, ఎవరి ప్రశంసలు అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఆయన `దేవర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ వచ్చినా, సుమారు ఐదు వందల కోట్లు వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేసింది. 

read more: త్రివిక్రమ్‌ కి షాక్‌.. అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్‌ తోనే?.. బన్నీ కొత్త రూల్‌

Latest Videos

click me!