Akhanda Heroine Birthday Pics: బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌ బర్త్ డే పార్టీలో రకుల్‌ రచ్చ.. ఫోటోలు వైరల్‌

Published : Jan 15, 2022, 09:38 AM IST

బాలయ్య నటించిన `అఖండ` చిత్రంతో బంపర్‌ హిట్‌ అందుకున్న ప్రగ్యా జైశ్వాల్‌ ఇప్పుడు తన బర్త్ డే సెలబ్రేషన్‌లో మునిగి తేలుతుంది. తాజాగా ప్రగ్యా తన బర్త్ డే ఫోటోలను పంచుకోగా, అందులో రకుల్‌ హల్‌చల్‌ చేయడం  విశేషం.   

PREV
18
Akhanda Heroine Birthday Pics: బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌ బర్త్ డే పార్టీలో రకుల్‌ రచ్చ.. ఫోటోలు వైరల్‌

బాలకృష్ణతో కలిసి నటించిన `అఖండ` చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటించింది. జిల్లా కలెక్టర్‌గా ఆమె హుందాతనంతో కూడిన పాత్రలో కనువిందు చేసింది. ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో ప్రగ్యాకి మంచి పేరొచ్చింది. అంతేకాదు కెరీర్‌కి బిగ్‌ బ్రేక్‌నిచ్చింది. పడిపోతున్న కెరీర్‌కి పెద్ద బూస్టప్‌ ఇచ్చింది. 
 

28

దీంతో ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసింది తన బర్త్ డే. జనవరి 12న ప్రగ్యా జైశ్వాల్‌ పుట్టిన రోజు. ముంబయిలో ఉంటున్న ఆమె అక్కడే తన బర్త్‌ డే జరుపుకుంది. అతికొద్ది మంది ఫ్రెండ్స్ తో కలిసి తన బర్త్ డేని నిర్వహించుకుంది ప్రగ్యా. ఇందులో తన ఫ్రెండ్స్ తోపాటు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా ఉండటం విశేషం. వీరిద్దరు చాలా కాలంగా మంచి స్నేహితులు. తెలుగులో రాణిస్తున్న క్రమంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం చిగురించింది.

38

ఆ స్నేహాన్ని చాటుకున్నారు. అయితే ప్రగ్యా బర్త్ డే పార్టీలో మాత్రం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రగ్యా పంచుకున్న ఫోటోలు చూస్తుంటే వీరి ఏ రేంజ్‌లో ఎంజాయ్‌ చేశారో, పార్టీలో రచ్చ చేశారో అర్థమవుతుంది.  మొత్తంగా ఫ్రెండ్స్ తో కలిసి తెగ ఎంజాయ్‌ చేసినట్టు తెలుస్తుంది. 

48

ప్రస్తుతం ప్రగ్యా  పంచుకున్న తన బర్త్ డే ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ప్రగ్యాకి విషెస్‌ చెప్పడం,  ఆమెపై కామెంట్లు చేయడం విశేషం. ఓ రకంగా బాలయ్య అభిమానులకు ప్రగ్యా దగ్గరయ్యిందని చెప్పొచ్చు. 

58

`కంచె` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది  ప్రగ్యాజైశ్వాల్‌. ఇందులో ఆమె జమీందారి కుటుంబానికి చెందిన అమ్మాయిగా చాలా హుందాతనంతో కూడిన పాత్రలో నటించి ఆకట్టుకుంది. కానీ కెరీర్‌ పరంగా ఆమె సరైన బాటలు వేసుకోలేకపోయింది. కథలు, పాత్రల ఎంపికలో చేసిన మిస్టేక్స్ తో ప్రగ్యా కెరీర్‌ ప్రశ్నార్థకంలో పడింది. 

68

ఈ నేపథ్యంలో ఇక ప్రగ్యా పని అయిపోయిందని అంతా ఫిక్స్ అయిన సమయంలో ఊహించిన విధంగా బాలయ్య సినిమాలో ఆఫర్‌ వచ్చింది. `అఖండ`లో ఆమె హీరోయిన్‌గా ఆకట్టుకుంది. సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ప్రగ్యాకి పెద్ద బూస్ట్ దొరికినట్టయ్యింది. దీంతో ఇప్పుడు మేకర్స్ ప్రగ్యా కోసం వెంటపడుతున్నారని టాక్‌. 

78

ఇదిలా ఉంటే రకుల్‌ దారిలో వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటుందట ప్రగ్యా జైశ్వాల్‌. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది రకుల్‌. ఆమె తరహాలోనే ప్రగ్యా కూడా  బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. ఆమె హిందీలో సల్మాన్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం.

88

 దీంతోపాటు మరికొన్ని ఆఫర్స్ వస్తున్నాయట. ఇటు తెలుగులోనూ కొత్త సినిమాలకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి ఇప్పుడైనా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కెరీర్‌ని సరైన విధంగా బిల్డ్ చేసుకుంటుందేమో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories