Kiara Advani Swim Pic: సమంతకే జలసీ పుట్టిస్తున్న రామ్‌చరణ్‌ బ్యూటీ.. తడిసిన అందాలతో కవ్వింత.. చూస్తే సెగలే

Published : Jan 15, 2022, 08:56 AM ISTUpdated : Jan 15, 2022, 08:57 AM IST

మహేష్‌, రామ్‌చరణ్‌లతో ఆడిపాడి, తెలుగు ఆడియెన్స్ ని పలకరించి, పులకరింపచేసిన కియారా అద్వానీ తెలుగు ఆడియెన్స్ కి దూరమైనా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం  అందరికి టచ్‌లోనే ఉంది. ఎవరికి కావాల్సింది అది  ఇస్తూ కనువిందు చేస్తుంది. 

PREV
19
Kiara Advani Swim Pic: సమంతకే జలసీ పుట్టిస్తున్న రామ్‌చరణ్‌ బ్యూటీ..  తడిసిన అందాలతో కవ్వింత.. చూస్తే సెగలే

కియారా అద్వానీ(Kiara Advani) సంక్రాంతి ఫెస్టివల్‌ సందర్భంగా తన గ్లామర్‌ విందుతో కనువిందు చేస్తుంది. ఈ బ్యూటీ  సముద్రంలో స్విమ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది.  సూర్యకిరణాలు కియారా అద్వానీ అందాలను ముద్దాడగా, పరవశించిపోతూ తన్మయత్వం చెందుతుందీ అందాల  బ్యూటీ. ఈ ఫోటోని నెటిజన్లతో పంచుకుని ఓ రకంగా సంక్రాంతి ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. 

29

సముద్రంలో రోజు అనే అర్థంతో Kiara Advani పంచుకున్న పోస్ట్, ఈ ఫోటో అభిమానులను పర్‌ఫెక్ట్ ట్రీట్‌లా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం కియారాని  ఇలా చూసిన అభిమానులు తెగ ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఇచ్చిన కిర్రాక్‌ పోజుకి మంత్రముగ్దులవుతున్నారు. దీనిపై సమంత స్పందించింది. `వాహ్‌` అంటూ కామెంట్‌ చేయడం విశేషం. దీంతో సమంతకే జలసీ పుట్టిస్తున్న కియారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

39

ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది కియారా. అందులో భాగంగా  ఇలా జలకాలాడుతూ కనిపించిందని  అంటున్నారు. అయితే ఇది ప్రజెంట్‌ ఫోటోనేనా,  లేక థ్రోబ్యాక్‌ పిక్‌ అనేది క్లారిటీ లేదు. మొత్తంగా  ఇప్పుడిది కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

49

అంతకు ముందు పింక్‌ డ్రెస్‌లో కియారా స్టయిలీష్‌ లుక్స్ తో కనువిందు చేస్తుంది.  ఆమె పంచుకున్న ఫోటోలు నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. వైరల్‌  అవుతున్నాయి. కూల్‌  గ్లాసెస్‌లో యమ స్టయిల్‌గా  కనిపిస్తుంది కియారా. 
 

59

కియారా అద్వానీ చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ భామ మహేష్‌తో `భరత్‌ అనే నేను` చిత్రంతో తెలుగు ఆడియెన్స్  ని పలకరించింది. కొరటాల శివ దర్శకత్వం  వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రామ్‌చరణ్‌,  బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన `వినయ విధేయ  రామ` చిత్రంలో నటించింది. ఈ సినిమా పరాజయం చెందడంలో తెలుగుకి గుడ్‌ బై చెప్పింది  కియారా. 

69

కొంత గ్యాప్‌తో మళ్లీ తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుంది. తన అందాలతో పులకరించబోతుంది. ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్‌తో మరో సినిమా చేస్తుంది. పాన్‌ ఇండియా  డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌సీ15` చిత్రంలో నటిస్తుంది. ఇది పాన్‌ ఇండియా  లెవల్‌లో రూపొందుతుండటం విశేషం. 

79

మరోవైపు హిందీలో ఇటీవల `షేర్షా` చిత్రంతో విజయాన్ని అందుకుంది. ఇది బ్లాక్‌ బస్టర్‌ రిపోర్ట్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ `భూల్‌ భులైయ్యా 2`, `జగ్‌  జుగ్‌  జీయో`,  `గోవిందా నామ్‌ మేరా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

89

సోషల్‌ మీడియా  మాత్రం చాలా  యాక్టివ్‌గా  ఉంటుంది కియారా. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్‌డేట్లతోపాటు  తన అందమైన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను దగ్గరవుతుంది.  ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

99

ఇంకోవైపు డేటింగ్ రూమర్స్ తో సంచలనంగా మారింది  కియారా. ప్రస్తుతం  ఈ బ్యూటీ `షేర్షా` స్టార్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రాతో లవ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరు కలిసి చాలా సార్లు కెమెరాలకు చిక్కారు. ఓ వైపు ఎయిర్‌పోర్ట్ లో,  మరోవైపు పార్టీల్లో కలిసి సందడి చేయడం  విశేషం. అంతేకాదు పలు మార్లు సిద్ధార్థ్‌ ఇంటి వద్ద  కూడా కనిపించింది  కియారా. దీంతో వీరిద్దరు  ఘాటు  ప్రేమలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వచ్చే  ఏడాది  మ్యారేజ్‌ చేసుకునే ఆలోచనలోనూ ఉన్నారని  టాక్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories