తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది, తెలుగు రాష్ట్రాల కోసం బాలయ్య భారీ విరాళం

First Published | Sep 3, 2024, 5:55 PM IST

బాలకృష్ణ ఇటీవలే ఇండస్ట్రీలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. భారీగా సెలబ్రేషన్‌ నిర్వహించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కోసం తన పెద్ద మనసుని చాటుకున్నారు. 
 

Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ నటుడిగా చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 1974లో వచ్చిన `తాతమ్మ కల` చిత్రంతో నటుడిగా మారారు బాలయ్య. ఇందులో బాలకృష్ణ పాత్రలోనే నటించి ఆకట్టుకున్నాడు. తొలి సినిమాలోనే అదరగొట్టాడు బాలయ్య. తండ్రి రూపొందించిన చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. 
 

Actor Balakrishna

అలా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక ఆయన హీరోగా టర్న్ తీసుకున్నాడు. పదేళ్ల తర్వాత `సాహసమే జీవితం` సినిమాతో హీరోగా మారారు బాలయ్య. `మంగమ్మగారి మనవడు` చిత్రంతో సోలో హీరోగా బ్రేక్ అందుకున్నాడు.

ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోగా వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. తిరుగులేని స్టార్‌గా తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు బాలయ్య. 

Latest Videos


Balakrishna

ఇప్పటి వరకు 108 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇటీవల వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టాడు. ఇప్పుడు మరో హ్యాట్రిక్‌ కోసం రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య ఇండస్ట్రీలో నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఘనంగా సత్కరించారు. సన్మానించారు. మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. 

ఇదిలా ఉంటే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భీబత్సం సృష్టించారు. భారీ వర్షాల కారణంగా అటు ఏపీ, ఇటు తెలంగాణలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. ఇళ్లు కూలిపోయారు. రోడ్డు తెగిపోయాయి. పంట నష్టం జరిగింది. రెండు ప్రభుత్వాలు అత్యవసర సేవలు అందిస్తున్నాయి.  ఏపీలో ఎక్కువగా వరదలు ముంచెత్తడంతో జనం అవస్థలు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో సినిమా ప్రముఖులు స్పందించి ఆర్థిక సహాయాలను ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా బాలయ్య కూడా ప్రకటించారు. ఆయన ఏకంగా కోటీ రూపాయల విరాళం ప్రకటించడం విశేషం. అటు ఏపీ ప్రభుత్వానికి యాభై లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు ప్రకటించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందించబోతున్నట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ చెబుతూ, 50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. 
 

నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. 

రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను` అని తెలిపారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుందని సమాచారం.

బాలకృష్ణ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. హిందూపూర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటు సినిమా, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. 

click me!