చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల విషయంలో స్నేహ బాధపడే అంశం ఏంటో తెలుసా? పవర్‌స్టార్‌కే ఆ క్రెడిట్‌

First Published | Sep 3, 2024, 4:22 PM IST

హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న స్నేహ తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బాధపడే విషయాన్ని వెల్లడించింది. 
 

స్నేహ సాంప్రదాయానికి చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. హోమ్లీ బ్యూటీగా తెలుగు ఆడియెన్స్ ని అలరించింది స్నేహ. ఆమె ఏ సినిమా చేసిన ఎప్పుడో తన హద్దులు దాటలేదు. తన పరిధిలోనే నటనతో మెప్పించే ప్రయత్నం చేసింది. కెరీర్‌లో ఇప్పటి వరకు ఆమె తన లిమిట్స్ ని క్రాస్‌ చేసింది లేదు. అందుకే అందరిలోనూ స్నేహ అంటే ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. 
 

స్నేహ పెళ్లి చేసుకున్నా హీరోయిన్ గా సినిమాలకు దూరమైంది. కొంత కాలం ఫ్యామిలీకే పరిమితమైన ఆమె ఇటీవల కాలంలో మళ్లీ మెరుస్తుంది. అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఆ మధ్య తెలుగులో `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `వినయ విధేయ రామ` చిత్రాల్లో మెరిసింది. రెండో చిత్రం డిజప్పాయింట్‌ చేయడంతో మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. 

తాజాగా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణమేంటనేది తెలిపింది స్నేహ. మంచి స్క్రిప్ట్ లు రావడం లేదని, నచ్చే కథలు రావడం లేదని తెలిపింది. తాను చాలా సెలక్టీవ్‌గా వెళ్తాననే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేసింది. 
 


ఇంకోవైపు తెలుగులో తాను ఇద్దరు హీరోలతో చేయలేదని వెల్లడించింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ లతో నటించలేదని, కానీ ఆల్మోస్ట్ అందరు హీరోల సినిమాల్లోనూ నటించినట్టు చెప్పింది. ఈ విషయంలో తనకు కొంత బాధగా ఉందని చెప్పింది స్నేహ. 

అయితే మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో నటించే అవకాశం రాలేదని, ఈ విషయంలో ఫీల్ బ్యాడ్‌ అని వెల్లడించింది. `గోట్‌`(గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్) చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో తెలిపింది స్నేహ. విజయ్‌ హీరోగా నటించిన ఈ మూవీకి వెంకట్‌ ప్రభు దర్శకుడు. ఇందులో విజయ్‌కి జోడీగా స్నేహ నటించింది. 
 

మీనాక్షి చౌదరి, ప్రశాంత్‌, ప్రభుదేవా, వైభవ్‌, లైలా వంటి వారు ఇందులో కీలక పాత్రలో నటించారు. విజయ్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న స్నేహ పవన్‌, చిరులపై స్పందించింది.
 

ఇందులో స్నేహ.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్‌ తెలిపింది. అంతేకాదు.. టాలీవుడ్‌లో గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్ అనే ట్యాగ్‌ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారని యాంకర్‌ అడగ్గా, పవన్ కి ఇస్తానని తెలిపింది. ఆయన సినిమాల్లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ పవర్‌ స్టార్‌ అంటూ కితాబిచ్చింది స్నేహ. 
 

స్నేహ ఒకప్పుడు తెలుగులో `ప్రియమైన నీకు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది స్నేహ. `హనుమాన్‌ జంక్షన్‌`తో హిట్ అందుకుంది. `వెంకీ` సినిమాతో బ్రేక్‌ అందుకుంది. `సంక్రాంతి`, `రాధాగోపాలం`, `శ్రీరామదాసు`, `ఎవండోయ్ శ్రీవారు`, `మనసు పలికే మౌనరాగం`, `మహారథి`, `మధుమాసం`, `పాండురంగడు`, `ఆదివిష్ణు`,`రాజన్న` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పిచింది స్నేహ. 
 

Latest Videos

click me!