బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో కనిపించని మోక్షజ్ఞ, కారణం ఏంటి..?

మెగాస్టార్.. సూపర్ స్టార్ల మధ్య నందమూడిబాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో బాలయ్య తనయుడు.. అప్ కమింగ్ హీరో మోక్షజ్ఞ కనిపించకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్ళాడు..? 

తాతమ్మ కల సినిమాతో నందమూరి వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలయ్య బాబు. బాల నటుడి నుంచి హీరోగా మారి.. తిరుగులేని సక్సెస్ తో దూసుకుపోతున్నాడు బాలయ్యబాబు. అంతే కాదు ఎన్టీఆర్ తరువాత నందమూరి నట వారసత్వాన్ని నిలబెట్టిన హీరోగా బాలయ్య నిలిచిపోయాడు. ఇక ఆయన సినిమా జీవితానికి 50 ఏళ్ళు నిండాయి. స్వర్ణోత్సవాలు ఘనంగాజరిగాయి. 

బాలయ్య బాబు 50 ఏళ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. సినీ స్వ‌ర్ణోత్స‌వాల‌ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఘనంగా నిర్వహించింది.  భారీ ఎత్తున ఫంక్షన్ నిర్వహించారు. సినీ పరిశ్రమ నుంచి అతిరధ మహారధుల తో పాటు.. బాలయ్య ఫ్యామిలీ అంతా ఈ వేడుకల్లో పాల్గోన్నారు. అయితే ఆంధ్రాలో వరదల కారణంగా చంద్రబాబు, లోకేష్  ఈ వేడుకలకు రాలేకపోయారు. 

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాగా.. వెంకటేష్, మోహన్ బాబ, ఇతర టాలీవుడ్ యంగ్ హీరోలు ఈ వేడుకల్లో సందడి చేశారు. అయితే  ప్రభాస్, మహేష్ లాంటి హీరోలు అందుబాటులో లేక రాలేదు.

జూనియర్ ఎన్టీఆర్‌ వస్తాడేమో అని ప్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూసినా.. ఎన్టీఆర్ తన తల్లితో పాటు కర్ణాటకలోని దేవాలయాల సందర్శకు వెళ్ళారు. 


అయితే ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నా.. ఈ వేడుకల్లో బాలయ్య తనయుడు మోక్షజ్ణ కనిపించకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. బాలయ్య సినీజీవితానికి స్వర్ణోత్సావాలు జరుగుతున్న వేళ..  ఇలాంటి ఫంక్షన్‌కు మోక్షజ్ఞ తప్పనిసరిగా రావాలి. కాని ఆయన ఎందుకు కనిపించలేదు అని అందరికి డౌట్ స్టార్ట్ అయ్యాంది. 

అయితే ఈ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్న క్రమంలో..  మోక్షజ్ఞ రాకపోవడానికి ఓ బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకిరెడీ అవుతున్నాడు. ఇప్పటికే లుక్ ను కంప్లీట్ గామార్చేశాడు.

ఈక్రమంలో నటనలో శిక్షణ కూడా పొందుతున్నాడు. యాక్టింగ్ కోర్స్ కోసం ఆయన వైజాగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  డైలాగ్, నటన, శిక్షణను సత్యానంద దగ్గర తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే ఈ ఫంక్షన్‌కు వస్తే కెమెరాల కళ్ళు అన్ని సహజంగానే మోక్షజ్ఞ మీద ఉంటాయి.

త్వరలో హీరోగా లాంఛ్‌ చేసినప్పుడు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది. పైగా ఈ ఫోటోలు బయటికి వెళ్తే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు కూడా ప్రచారం జరుగుతాయి. మీడియా అంతా మోక్షజ్ఞ ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది 

అందుకే ఇదంతా ఎందుకు లాంచింగ్ వరకూ మోక్షజ్ఞ కనిపించకుండా ఉంటేనే మంచిది అనుకున్నారట బాలయ్య. అందకే ఈ ఫంక్షన్‌కు మోక్షజ్ఞను తీసుకురాలేదని సమాచారం. ఇక నందమూరి ఫ్యాన్స్  గత ఐదారేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కాని అది డిలే అవుతూ  వస్తోంది. ఇక ఈక్రమం రీసెంట్ గా ఈఏడాది మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ వచ్చింది. 

హనుమాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాతో ఒక్కసారిగా అందరికళ్ళు తన వైపునకు తిప్పుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డెబ్యు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి, నందమూరి తేజస్విని కలిసి సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

Latest Videos

click me!