Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు

Published : Nov 02, 2026, 04:06 PM IST

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడుతుండగా.. అభిమానులు అంతా ఆయన కాబోయే భార్య 'కావ్యా.. కావ్యా..' అంటూ గట్టిగా అరుస్తూ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

PREV
15
స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో, సన్ టీవీ ఎండీ కావ్యా మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో అనిరుధ్ పాల్గొన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

25
చెన్నై రన్స్ 2026 ఈవెంట్‌లో అభిమానుల రచ్చ

చెన్నైలో జరిగిన 'చెన్నై రన్స్ 2026' ఈవెంట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ స్పెషల్ గెస్ట్‌గా వెళ్లాడు. అక్కడ స్టేజ్‌పై తన సూపర్ హిట్ సాంగ్ 'కల్యాణ వయసు' పాడాడు. వెంటనే అక్కడున్న అభిమానులు అంతా ఫుల్ జోష్‌లో అనిరుధ్ కాబోయే భార్య కావ్యా మారన్ పేరును 'కావ్యా.. కావ్యా..' అంటూ గట్టిగా అరిచారు. ఈ క్యూట్ మూమెంట్‌ను అనిరుధ్ అభిమానుల తో సెల్ఫీ తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోలు ఎక్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

35
గ్రీస్‌లో పెళ్లి.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్

అనిరుధ్, కావ్యా మారన్ పెళ్లి నవంబర్ 10, 11 తేదీల్లో యూరప్ దేశమైన గ్రీస్‌లో జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. అక్టోబర్‌లో కావ్యా పేరెంట్స్ కళానిధి మారన్, కావేరి మారన్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కార్డు ఇచ్చినప్పుడే ఈ రిసెప్షన్ డేట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది.

45
అందరి దృష్టి లాగుతున్న వెడ్డింగ్ కార్డ్

పెళ్లి పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఐవరీ, పౌడర్-బ్లూ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేసిన స్పెషల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కార్డు డిజైన్‌లో అనిరుధ్, కావ్యా స్వయంగా ఇన్వాల్వ్ అయ్యారని, ప్రతి చిన్న డీటెయిల్‌ను దగ్గరుండి చూసుకున్నారని ఇన్విటేషన్ డిజైనర్ రంజినీ అయ్యంగార్ చెప్పారు.

55
పెళ్లికి రానున్న రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు

చెన్నైలో జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్‌కు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన వీఐపీలు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం, సి. జోసెఫ్ విజయ్ సహా పలువురు టాప్ సినీ స్టార్స్‌కు ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories