బాలకృష్ణ వాచ్ పై సోషల్ మీడియాలో రచ్చ.. కాస్ట్ తెలిస్తే.. కళ్ళు తిరగాల్సిందే..?

Published : Jan 10, 2023, 09:12 PM IST

60 ఏళ్ళు దాటి... వయస్సు పరుగులు తీస్తున్నా.. కుర్రాళ్లు పోటీ ఇస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.

PREV
17
బాలకృష్ణ వాచ్ పై సోషల్ మీడియాలో రచ్చ.. కాస్ట్  తెలిస్తే.. కళ్ళు తిరగాల్సిందే..?

60 ఏళ్ళు దాటి... వయస్సు పరుగులు తీస్తున్నా.. కుర్రాళ్లు పోటీ ఇస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. చాలా బాధ్యతలు ఆయన మోస్తున్నాడు. అటు సినిమాలు, ఇటు సోషల్ సర్వీస్. బసవతారకం హాస్పిటల్ తో పాటు.. యాంకర్ గా కూడా బిజీ అయిపోయాడు బాలయ్య.  క్రమంలో ఆయన కుర్ర  హీరోలను మించి మెయింటేన్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నాడు. 
 

27

60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు బాలయ్య..  ప్రొఫెషన్ సంగతి పక్కన పెడితే.. పర్సనల్‌గా బాలయ్య స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. పాలిటిక్స్ వైపు అయితే వైట్ అండ్ వైట్ యెయింటేన్ చేసే బాలకృష్ణ.. .నార్మల్‌గా  అయితే డిజైనింగ్ షర్ట్స్, ఫుల్ హ్యాండ్స్ ఫోల్డ్ చెయ్యకుండా ఎడమ చేతి మణికట్టుపైన వాచ్ పెట్టడం బాలయ్య స్టైల్.

37

ప్రస్తుతం ఈ వాచ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇంతకు ముందు ఎప్పుడు బాలకృష్ణ బట్టల గురించి కాని.. ఇదర స్టైలీష్ ప్రొడక్స్ గురించి కాని పెద్దగా వార్తలు వచ్చింది లేదు. ఈసారి మాత్రం  వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ బాలయ్య తన స్టైల్‌లో ఆకట్టుకున్నారు. దాంతో బాలయ్య ట్రెండ్ అవుతున్నారు. ప్రస్తుతం అందరి చూపు బలయ్య పైనే ఉంది. ముఖ్యంగా వీరసింహా రెడ్డి  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య పెట్టుకొచ్చిన వాచీపైన పడింది.. వెంటనే నందమూరి ఫ్యాన్స్ ఆ వాచ్ గురించి మొత్తం జాతకం బయట పెట్టేశారు. 
 

47

ప్రీ రిలీజ్ లో బాలయ్య పెట్టుకున్  వాచ్  కార్టియర్ శాంటాస్ 100 స్కెలెటిన్ (Cartier Santos 100 Skeleton) బ్రాండ్‌కి చెందింది.. దీని రేట్ తెలిస్తే కళ్ళు తిరగక మానదు. ఈ వాచ్ ధర దాదాపు 26,90,000.  26 లక్షల 90 వేల రూపాయలవాచ్ తో బాలయ్య హాట్ టాపిక్ అవుతున్నారు.  నందమూరి ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. 
 

57
Bigg Boss Telugu 6

ఉన్నది ఉన్నట్టు ముఖం మీదనే చెప్పేసే బాలయ్య బాబుది  కల్మషంలేని మనసు అంటారు.  తెలియదు.. కోపం ఎక్కువ అయినా.. మంచి మనసు బాలయ్యది. తేడా వస్తే మాత్రం అంతే సంగతులు. ఇక ఈక్రమంలో బాలయ్య ఈమధ్య జోరు చూపిస్తున్నారు. హోస్ట్ గా ఆహాలో అన్ స్టాపబుల్ ను సక్సెస్ ఫుల్ గా సెకండ్ సీజన్ వరకూ తీసుకువచ్చి..టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్నారు. ఈక్రమంలో ఆయన స్టైలీష్ లుక్స్ పై పెద్ద చర్చ జరుగుతోంది. 
 

67

ఇక నుంచి బలయ్య స్టైల్ పై.. ఆయన వాడే వస్తువులపై ఓ కన్ను వేయలని చూస్తున్నారు బలయ్య అభిమానులు . సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తుంటారు నటసింహం. సాధారణంగా సినిమా ప్రోగ్రామ్స్‌లో స్టైలిష్ కాస్ట్యూమ్స్, బ్లేజర్‌తో కనిపిస్తుంటార.. ఇక టాక్ షోలో వాడే కాస్ట్యూమ్స్ గురించి  చెప్పక్కర్లేదు.. స్టైలింగ్‌తో అదరగొట్టేస్తున్నారు..

77

ఇక వీరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే.. ఈమూవీ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  సంక్రాంతి కానుకగా జనవరి 12న  వీరసింహా రెడ్డి.. ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ తో  బాలయ్య బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈమూవీని మైత్రీ బ్యానర్ లో నిర్మించారు. శ్రుతి హాసన్ బాలయ్య సరసన హీరోయిన్ గా సందడి చేసింది. 
 

click me!

Recommended Stories