ప్రస్తుతం జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్, అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. దీనికి కూడా శ్రీముఖినే యాంకర్. శ్రీముఖి యాంకరింగ్ లో తనదైన శైలికి కలిగి ఉండటం ఆమెకు కలిసొస్తుంది. పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి.