అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉంటున్నబాలయ్య.. ఓటీటీ వేదికన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’తో ప్రేక్షకుల్లో మరింత ఎత్తుకు ఎదిగారు. ఆయన అసలైన వ్యక్తిత్వం, హ్యూమరస్, చిలిపితనం అభిమానులు, ఆడియెన్స్ కు ఎంతగానో నచ్చుతోంది. సీజన్ 2 కూడా ప్రారంభం కావడంతో ఖుషీ అవుతున్నారు. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14న ‘ఆహా’లో ప్రసారం కానుంది.