బాలకృష్ణ అఖండ 2 టికెట్ ధర రూ.2 లక్షలు..ఇదేం అభిమానం బాబోయ్, ఎక్కడో తెలుసా ?

Published : Nov 30, 2025, 04:03 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 5 న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జర్మనీకి చెందిన బాలయ్య అభిమాని ఒకరు ఈ చిత్ర టికెట్ ని భారీ ధర వెచ్చించి కొనుగోలు చేశారు. 

PREV
15
బాలకృష్ణ అఖండ 2 తాండవం 

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇది నాల్గవ చిత్రం. గతంలో వీరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు వచ్చి ఘన విజయం అందుకున్నాయి. 

25
అఖండ 2 రిలీజ్ డేట్ 

అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ అంచనాలతో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అఖండ పాత్రలో బాలయ్య గెటప్ వైల్డ్ గా ఉంది. శివ భక్తికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. 

35
ఖండాలు దాటిన అభిమానం 

ఇప్పటికే నందమూరి అభిమానుల్లో అఖండ 2 ఫీవర్ మొదలైంది. అఖండ 2 క్రేజ్ ఖండాంతరాలు దాటుతోంది. ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ తో అఖండ 2 టికెట్ రూ. 2 లక్షలకు అమ్ముడైంది. జర్మనీకి చెందిన ఓ అభిమాని అఖండ టికెట్ ని రూ 2 లక్షలు పెట్టి కొన్నారు. 

45
అఖండ 2 పై భారీ అంచనాలు 

ఫ్రాంక్ ఫర్ట్ నగరంలో బాలయ్య అభిమాని అఖండ 2 టికెట్ ని ఇంత భారీ మొత్తం పెట్టి కొన్నారు. అయితే ఆ అభిమాని పూర్తి వివరాలు మాత్రం బయటకి రాలేదు. అఖండ 2 చిత్రం కలెక్షన్స్ టార్గెట్ కూడా చాలా భారీ గా ఉంది. 

55
అఖండ 2 టార్గెట్ ఇదే 

ఈ చిత్రం హిట్ కావాలంటే వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ పైగా రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ గా నటించారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

Read more Photos on
click me!

Recommended Stories