మెగా హీరోలను వెంటాడుతున్న ఇంగ్లీష్ భూతం... సెంటిమెంట్ రిపీట్ అయితే గాడ్ ఫాదర్ గోవిందే!

First Published Sep 22, 2022, 1:07 PM IST

ఒక ప్రక్క హైప్ లేక ఇబ్బందిపడుతున్న గాడ్ ఫాదర్ మూవీని మరో బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతుంది. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే చిరంజీవికి మరో డిజాస్టర్ ఖాయం అంటున్నారు. 
 


మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ ఆయన ఈ తరం సూపర్ స్టార్స్ తో పోటీపడుతున్నారు.  అయితే ఆయన గత చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య చిరంజీవి కెరీర్ లో అతిపెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. దీని వెనుక ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. 'ఆ' అక్షరంతో మొదలయ్యే టైటిల్ చిరంజీవికి కలిసి రాలేదు అంటారు . 

ఆరాధన, ఆపద్బాంధవుడు ఫెయిల్యూర్స్ దానికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ చిత్రానికి కూడా ఇలాంటి గండం ఒకటి ఉంది. మెగా హీరోలకు ముఖ్యంగా... రామ్ చరణ్, చిరంజీవికి ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదు. ఇంగ్లీష్ టైటిల్స్ తో వీరు చేసిన చిత్రాలు అనేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

చిరంజీవికి కలిసిరాని ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ రామ్ చరణ్ ని కూడా వెంటాడింది. రామ్ చరణ్ ఇప్పటి వరకు రెండు చిత్రాలు ఇంగ్లీష్ టైటిల్స్ తో చేశారు. అవి రెండు డిజాస్టర్ అయ్యాయి. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత విడుదలైన ఆరంజ్ మూవీ ప్లాప్ అయ్యింది. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన బ్రూస్లీ మూవీ మరో డిజాస్టర్ గా నిలిచింది.

ఇక చిరంజీవి కెరీర్లో ఇంగ్లీష్ టైటిల్ తో పది చిత్రాల వరకు చేశారు. వాటిలో మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. చిరంజీవి ఇంగ్లీష్ టైటిల్ తో చేసిన మొదటి చిత్రం ' ఐ లవ్ యు' అప్పటికి చిరంజీవికి నటుడిగా పెద్ద గుర్తింపు రాలేదు. ఆ సినిమా సరిగా ఆడలేదు. అనంతరం స్టేట్ రౌడీ, బిగ్ బాస్,మాస్టర్, డాడీ, స్టాలిన్ ఇలా ఇంగ్లీష్ టైటిల్ తో చేసిన చిత్రాలు డిజాస్టర్ లేదా యావరేజ్ రిజల్ట్ అందుకున్నాయి. 
 


ఆయన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఇంగ్లీష్ టైటిల్ కాగా ఈ బ్యాడ్ సెంటిమెంట్ మేకర్స్ ని భయపెడుతుంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. యాంటీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని మరింత హైలెట్ చేస్తున్నారు. కలిసిరాని టైటిల్ తో వస్తున్న గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతుంది అంటూ... నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు. 
 

ఆ మాటకొస్తే చిరంజీవి ఇంగ్లీష్ టైటిల్స్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టారని గుర్తు చేస్తున్నారు. ఛాలెంజ్, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి చిత్రాలు ఇంగ్లీష్ టైటిల్ తో విడుదలైన భారీ విజయాలు నమోదు చేశాయి. చిరు కెరీర్ల్ లో ఛాలెంజ్, గ్యాంగ్ లీడర్ ఎంత పెద్ద హిట్సో తెలిసిందే. కాబట్టి ఇవన్నీ అర్థం లేని ఆలోచనలని కొట్టిపారేస్తున్నారు. 
 

కాగా గాడ్ ఫాదర్ మూవీపై పరిశ్రమలో కనీస బజ్ లేదు. విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయినా ఈ చిత్రం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ ఉన్నప్పటికీ హైప్ క్రియేట్ కావడం లేదు. ఇటీవల 'మార్ మార్ థక్కర్' అనే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఆ సాంగ్ ఆకట్టుకుంది.

అలాగే మూవీపై అనేక నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా అవుట్ ఫుట్ పట్ల సంతృప్తి చెందని సల్మాన్ హిందీ వెర్షన్ విడుదల వద్దంటున్నారట. ఆయన ఈ మూవీని ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపడం లేదట. అలాగే గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదంటూ అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి, నయనతార, సల్మాన్ వంటి స్టార్ క్యాస్ట్ ఉన్న గాడ్ ఫాదర్ చిత్రానికి ఈ పరిస్థితి ఊహించనిదే.

click me!