బుల్లితెర అయినా, సినిమాలు అయినా ఇండస్ట్రీనే. కానీ బుల్లితెరకి, సినిమాకి మధ్య వ్యత్యాసం ఉందనేది వాస్తవం. సినిమాల్లో కనిపించేవారికే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సితారని తీసుకువచ్చి సీరియల్ యాడ్స్ లో నటింపజేయడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమానురాగాలు, ఆత్మీయత అంటూ సీరియల్స్ లో చూపించే ఎమోషన్స్ తోనే ఓ యాడ్ కూడా షూట్ చేశారు.