`సలార్‌` ఫ్యాన్స్ కి బ్యాడ్‌ న్యూస్‌.. ప్రభాస్‌ సినిమా ఆర్డర్‌లో సంచలన మార్పులు.. ఏది ఎప్పుడంటే?

Published : Jun 18, 2024, 03:50 PM IST

ప్రభాస్ సినిమాల ఆర్డర్‌ మారిపోయింది. ముందు రావాల్సిన మూవీ వెక్కి వెళ్తుంది. `సలార్ 2` కి సంబంధించిన ఓ డిజప్పాయింట్‌ అయ్యే వార్త చక్కర్లు కొడుతుంది.   

PREV
17
`సలార్‌` ఫ్యాన్స్ కి బ్యాడ్‌ న్యూస్‌.. ప్రభాస్‌ సినిమా ఆర్డర్‌లో సంచలన మార్పులు.. ఏది ఎప్పుడంటే?

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత భారీ లైనప్‌ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. ఆయన చేతిలో ఐదు సినిమాలున్నాయి. అందులో `కల్కి 2898 ఏడీ` ఈ నెలలోనే విడుదల కాబోతుంది. దీంతోపాటు నాలుగు సినిమాల్లో ఆయన నటించాల్సి ఉంది. వరుస లైనప్‌తో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తి కావడానికి మరో రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.

27

ప్రభాస్‌ ఈ నెల 27న `కల్కి 2898ఏడీ`తో రాబోతున్నాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మైథలాజికల్‌ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతుంది. భారీ బడ్జెట్‌, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ సినిమాకి అనుకున్న స్థాయిలో బజ్‌ రావడం లేదు. ప్రమోషన్స్ కూడా తగ్గించింది యూనిట్‌. హైప్‌ రాకుండా ఉండటం కోసమే ఇదంతా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ `కల్కి` సినిమా ఇండియన్‌ సినిమా లెక్కలను మార్చేసే మూవీ కాబోతుందని అంటున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. 
 

37

ఇక ప్రస్తుతం ప్రభాస్‌.. మారుతి దర్శకత్వంలో రూపొందుతన్న `ది రాజాసాబ్‌` సినిమాలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే చిత్రమిది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, ఇది రెగ్యూలర్ కమర్షియల్‌ మూవీలా ఉంటుందని, వింటేజ్‌ ప్రభాస్‌ని చూడొచ్చు అని దర్శకుడు మారుతి చెప్పారు. ఇందులో హర్రర్ టచ్‌ కూడా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికిగానీ, ప్రథమార్థంలోగానీ విడుదల చేయాలని భావిస్తున్నారు. 
 

47

అనంతరం ఏ సినిమా ప్రారంభమవుతుందనే కన్‌ఫ్యూజన్‌ నెలకొంది. త్వరలోనే `సలార్‌ 2` ఉంటుందని చాలా రోజులుగా అనుకున్నారు. `సలార్‌` ఊహించినదానికంటే పెద్ద హిట్‌ కావడంతో వెంటనే `సలార్‌ 2` చేయబోతున్నారని అన్నారు. కానీ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ట్విస్ట్ ఇచ్చాడు. ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభమవుతుందని, ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. దీంతో `సలార్‌ 2` ఇప్పుడు లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయినా, రెండు నెలలు ఉందని, ఈ లోపు ప్రభాస్‌ పార్ట్ షూట్‌ చేయోచ్చు, ఆల్‌రెడీ సినిమా చాలా భాగం షూటింగ్‌ అయిపోయిందని, మిగిలిన సీన్లు షూట్‌ చేసి నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్‌ చేసుకుని వచ్చే ఏడాది రిలీజ్‌ చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తుంది. 
 

57

మొత్తంగా `సలార్‌ ` ఫ్యాన్స్ కి డిజప్పాయింట్‌ చేసే వార్త బయటకు వచ్చింది. `సలార్‌ 2` ప్రారంభం కావడానికి రెండేళ్లు పడుతుందని తెలుస్తుంది. ప్రభాస్‌ ఇతర సినిమాలు పూర్తయ్యాక `సలార్‌ 2` చేస్తారని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్‌ మరో సినిమాని స్టార్ట్ చేయబోతున్నారట. `సలార్‌ 2` వెనక్కి వెళితే సందీప్‌ రెడ్డి వంగా మూవీ, హనురాఘవపూడితో సినిమాలుంటాయి. అయితే ముందుగా సందీప్‌ మూవీ `స్పిరిట్‌` స్టార్ట్ అవుతుందనుకున్నారు. ఆ తర్వాతే హను రాఘవపూడి మూవీ ఉంటుందన్నారు. కానీ ఇందులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. 
 

67

త్వరలోనే హనురాఘవపూడి సినిమా ప్రారంభం కానుందట. జులై నుంచి ఈ మూవీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. వార్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే సరికొత్త లవ్‌ స్టోరీ అని తెలుస్తుంది. దీన్ని వచ్చే నెలలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట ప్రభాస్‌. `సలార్‌ 2` డిలే అవుతున్న నేపథ్యంలో హను మూవీని పట్టాలెక్కించబోతున్నారట ప్రభాస్‌. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ ఏర్పాట్లు సాగుతున్నాయి. 
 

77

మరోవైపు సందీప్‌ రెడ్డి వంగాతో చేయాల్సిన `స్పిరిట్‌` మూవీ మరింత డిలే కానుందని తెలుస్తుంది. దీన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలనుకున్నారు. నవంబర్‌, డిసెంబర్‌ లో స్టార్ట్ అవుతుందని సందీప్‌ రెడ్డా వంగా తెలిపారు.  కానీ లేటెస్ట్ అప్‌ డేట్‌ ప్రకారం ఈ సినిమావచ్చే ఏడాది ప్రారంభంలో షూరు అవుతుందని అంటున్నారు. ఇలా `సలార్‌ 2` కారణంగా ఆర్డర్‌ మొత్తం మారిపోయింది. `సలార్‌ 2` వచ్చే ఏడాది చివర్లోగానీ, 2026లోగానీ ప్రారంభించనున్నని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories