బిగ్ బాస్ 8లో ఆ స్టార్ సీరియల్ హీరోయిన్... స్టార్ మా అంత సాహసం చేస్తుందా? రేటింగ్ ఢమాల్ కాదు!

First Published | Jun 18, 2024, 2:48 PM IST

బిగ్ బాస్ సీజన్ 8 కి రంగం సిద్ధం అవుతుండగా... కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక్కొక్కరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఓ టాప్ రేటెడ్ సీరియల్ లో హీరోయిన్ గా ఉన్న నటి హౌస్లో అడుగుపెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ 7 గత ఏడాది డిసెంబర్ లో గ్రాండ్ గా ముగిసింది. అత్యధిక టీఆర్పీ రేటు సాధించిన సీజన్ 7 మేకర్స్ లో జోష్ నింపింది. నిజానికి సీజన్ 6 అట్టర్ ప్లాప్. దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు షోని సరికొత్తగా ప్లాన్ చేశారు. మొదట 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి ప్రవేశ పెట్టి... ఐదు వారాల అనంతరం మరో 5 మంది కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించారు.

Bigg Boss Telugu 7

టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి కామనర్ కోటా లో హౌస్లో అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అర్జున్ అంబటి, ప్రియాంక సింగ్, ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫైనల్ కి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా... అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. మొదటి నుండి టైటిల్ ఫేవరేట్ గా ప్రచారమైన శివాజీ మూడో స్థానానికి పరిమితం అయ్యాడు. 
 


Brahmamudi

బిగ్ బాస్ సక్సెస్ నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందే సీజన్ 8 సిద్ధం కానుందని సమాచారం. ఆగస్టులో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. ఇప్పటికే కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు బిగ్ బాస్ 8 లో పాల్గొంటున్నారని సమాచారం. 

Brahmamudi

2023లో జనవరిలో బ్రహ్మముడి సీరియల్ ప్రారంభం అయ్యింది. స్టార్ మా టాప్ రేటెడ్ సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. మానస్-దీపికా రంగరాజు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సీరియల్ కి దీపికా రంగరాజు చేస్తున్న కావ్య పాత్ర స్పెషల్ అట్రాక్షన్. రాజ్(మానస్), కావ్య మధ్య గిల్లికజ్జాలు నవ్వులు పూయిస్తాయి. వారి కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. 

Brahmamudi

బ్రహ్మముడి సీరియల్ సక్సెస్ లో దీపికా రంగరాజు పాత్ర చాలా ఉంది. ఒకవేళ దీపికా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడితే ఆ సీరియల్ పరిస్థితి ఏంటనే వాదన ఉంది. అలాగే స్టార్ మా యాజమాన్యం సక్సెస్ఫుల్ సీరియల్ ని అటకెక్కించి దీపికాను బిగ్ బాస్ హౌస్ కి పంపే సాహసం చేస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

Brahmamudi

అయితే దీపికా రంగరాజు బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంటున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. యూట్యూబర్ బంచిక్ బబ్లు, సురేఖావాణి, కిరాక్ ఆర్పీ, నటి హేమ, హీరో రాజ్ తరుణ్ లతో పాటు మరికొందరు పేర్లు వైరల్ అవుతున్నాయి.

Latest Videos

click me!