ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి నటించిన బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మించారు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తొలి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ తరుణంలో బేబీ మూవీ రూపంలో ఆనంద్ దేవరకొండ అసలు సిసలైన హిట్ కొట్టేశాడు.
ఆనంద్ దేవరకొండతో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య యువతలో క్రేజీగా మారింది. సోషల్ మీడియాలో వైష్ణవి గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా యువతలో వైష్ణవి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. చిన్న సినిమాగా విడుదలైన బేబీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
ప్రస్తుతం బేబీ విజయాన్ని, క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న వైష్ణవి చైతన్య తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ యంగ్ బ్యూటీ బేబీ మూవీలో బోల్డ్ సీన్స్ లో సైతం నటించి ఆశ్చర్యపరిచింది. బేబీ చిత్రంలోని లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సన్నివేశాలపై వైష్ణవి తనదైన శైలిలో స్పందించింది. ఏదైనా చిత్రంలో రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ లో నటించడం చాలా కష్టం అని వైష్ణవి తెలిపింది.
కానీ ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. ఎందుకంటే ఆ సీన్స్ లో నటించేటప్పుడు బేబీ టీం నన్ను చాలా కంఫర్ట్ గా చూసుకున్నారు. సెట్స్ లో నాకు అసౌకర్యం లేకుండా చూసుకున్నారు. లిప్ లాక్ సీన్, రొమాంటిక్ సీన్ లో నటించేటప్పుడు సెట్ లో చాలా తక్కువ మందే ఉన్నారు. విరాజ్ అశ్విన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు.
ఇప్పటివరకు ఈ చిత్రంలో చాలా సన్నివేశాల్లో నటించాం. ఇది కూడా అలాంటి సన్నివేశమే అని అనుకో. జస్ట్ మనం నటిస్తున్నాం అంతే అని సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాడు. ఆ సీన్ సినిమాలో భాగంగానే చూశాను. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించగలిగా. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మూవీ చూశారు. వాళ్ళు కూడా అలాగే భావించారు అని వైష్ణవి తెలిపింది. అయితే బేబీ మూవీ కేవలం లిప్ లాక్ సన్నివేశం మాత్రమే కాదు. దానికి మించిన ఎమోషన్స్ ఈ చిత్రంలో అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత ఎమోషన్స్ మాత్రమే గుర్తుంటాయి అని వైష్ణవి పేర్కొంది.
టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన వైష్ణవి ఆ తర్వాత యూట్యూబర్ గా మారింది. షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు పొందిన తర్వాత బేబీ చిత్రంలో అవకాశం దక్కింది. ఈ జర్నీకి తనకి ఎనిమిదేళ్లు పట్టింది అని వైష్ణవి పేర్కొంది. ఇండస్ట్రీకి హీరోయిన్ అయిపోయి ఎదో సాధించాలని రాలేదని.. నటిగా స్థిరపడాలని భావించా. కానీ అనుకోకుండా హీరోయిన్ గా అవకాశం వచ్చింది అని వైష్ణవి పేర్కొంది.