ఆరెంజ్ డ్రెస్ లో ఈషా రెబ్బా ఖతర్నాక్ ఫోజులు.. గుచ్చే చూపులతో గుండెకు గాయం చేస్తున్న తెలుగు అందం

First Published | Aug 23, 2023, 1:40 PM IST

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba)  సోషల్ మీడియాలో తన నయా లుక్స్ తో అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ కుర్ర హృదయాలను తనవైపు లాగేసుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 

పదేళ్లకు పైగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. కానీ ఇంతవరకు ఈ ముద్దుగుమ్మ సరైన సినిమా గానీ, హిట్ కానీ పడలేదు. కొన్నాళ్ల పాటు బడా హీరోల సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలోనే నటిస్తూ వచ్చింది. అటు హీరోయిన్ గానూ ఆయా చిత్రాలతో అలరించింది. 
 

ఇప్పుడిప్పుడు యంగ్ బ్యూటీ ఈషా రెబ్బాకు మంచి ఆఫర్లు అందుతున్నాయి. భారీ చిత్రాల్లో కాకపోయినా ద్వితీయ శ్రేణి హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ కుర్ర భామ తెగ సందడి చేస్తోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. 
 


ఈ సందర్భంగా ఈషా రెబ్బా కొద్దినెలలుగా గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. గతంలో సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ట్రెండీ వేర్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో గ్లామర్ షో కూడా చేస్తోంది. తాజాగా అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది.

ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోషూట్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకునేలా ఉంది. ఆరెంజ్ డ్రెస్ లో తెలుగు అందం అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఫొటోలకు ఖతర్నాక్ ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది. బిగుతైన డ్రెస్ లో ఆకట్టుకునే స్ట్రక్చర్ చూపిస్తూ కట్టిపడేసింది. 

మరోవైపు మత్తుచూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. క్లోజప్ షార్ట్ లో తెలుగు అందాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ రూపసౌందర్యాన్ని కామెంట్ల రూపంలో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. తన ఫొటోషూట్ కు ఫిదా అవుతూ పిక్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ పరంగా చూస్తే.. ఈషా తెలుగు చిత్రాలతో పాటు అటు తమిళ సినిమాల్లోనూ మెరుస్తూ వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నైట్రో స్టార్ సుధీర్ బాబు సరసన ‘మామ మాశ్చీంద్ర’ (Mama Mascheendra)లో నటిస్తోంది. తమిళంలో ‘ఆయిరం జెన్మంగల్’ చిత్రం చేస్తోంది. రీసెంట్ గా జేడీ చక్రవర్తి తో ‘దయా’ వెబ్ సిరీస్ లో మెరిసింది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 
 

Latest Videos

click me!