‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఫస్ట్ రెమ్యునరేషన్ అంత తక్కువ? నిజంగా షాకే!

First Published | Jul 16, 2023, 6:06 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా ‘బేబీ’ సినిమాతో మంచి రిజల్ట్ ను అందుకుంది. అయితే ఆమె ఫస్ట్ రెమ్యునరేషన్ పై షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య పేరు గట్టిగా వినిపిస్తోంది. యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)  ‘బేబీ’ చిత్రంలో నటించింది. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ నటించారు. 
 

గీతా ఆర్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ అందుకున్న ఈమూవీ అటు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 


కేవలం రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి అదరగొట్టింది. సాయి రాజేశ్ రచన, దర్శకత్వానికి మంచి రివ్యూస్ దక్కడంతో పాటు వైష్ణవి చైతన్య నటనకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. పైగా ఈ బ్యూటీ ఇచ్చిన స్పీచ్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. దీంతో వైష్ణవి చైతన్య పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. 
 

ఈ క్రమంలోనే చైతన్య గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. వైష్ణవి ఫస్ట్ రెమ్యునరేషన్ షాకింగ్ కు గురిచేస్తోంది. యూట్యూబ్ సిరీస్ ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’తో మంచి క్రేజ్ దక్కించుకుంది.  దీంతో నెమ్మదిగా సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో ‘అలావైకుంఠపురంలో’ బన్నీ చెల్లెలిగా నటించింది. 
 

అయితే తను ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఓ ఈవెంట్ లోనూ డాన్స్ కోసం అవకాశం అందుకుంది. దానికోసం రోజంతా కష్టపడి డాన్స్ చేసిందంట. అందుకుగానూ కేవలం రూ.700 పారితోషికం అందుకుందని తెలుస్తోంది. అంత తక్కువ రెమ్యునరేషన్ వచ్చినా అది తనకు స్పెషల్ అని చెప్పినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం ‘బేబీ’తో హిట్ అందుకున్న వైష్ణవి  ఈ సినిమాకు మాత్రం రూ.10 లక్షల లోపు రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైష్ణవి చైతన్య నటనకు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో మున్ముందు మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. 
 

Latest Videos

click me!