పెళ్ళి పీటలెక్కబోతున్న బాలయ్య హీరోయిన్, వరుడెవరంటే..?

Published : Jul 16, 2023, 05:32 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లు వరుగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. హీరోలు,హీరోయిన్లు  వరుసగా పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా బాలయ్య సరసన నటించిన హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుంది.. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. 

PREV
14
పెళ్ళి పీటలెక్కబోతున్న బాలయ్య హీరోయిన్, వరుడెవరంటే..?

మాంత్రికన్ అనే మలయాళ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ నటాషా దోషి. మలయాళ సినిమాల్లో బాగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తరువాత కాలంలో.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  తెలుగులో బాలయ్య సరసన  జై సింహ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

24

ఆతరువాత  తెలుగులో వరుస సినిమాలు చేసింది బ్యూటీ... కోతల రాయుడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. మలయాళ సినిమాలు చేసుకుంటూనే.. తెలుగులో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. ఈమధ్యలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంత మంచివాడవురా సినిమాలో ఓ సాంగ్ చేసి మెప్పించింది. 

34

ఇక 2020 నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది నటాషా. అప్పటి నుంచి ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక తాజాగా నటాషా పెళ్లి పీటలు ఎక్కబోతోంది.  మానన్ షా అనే ఓవ్యాపార వేత్తను రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకుంది నటాషా దోషి. నిశ్చితార్థం ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

44

ఈ ఫోటోలను ఇన్ స్టాలో శేర్ చేసిన హీరరోయిన్.. ప్రేమ ఎప్పటికి గెలుస్తుంది అని ట్యాగ్ లైన్ కూడా రాసింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. నటాషా ప్రేమించిన అబ్బాయినే ఇరు కుటుంబాల్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతుంది. ప్రస్తుతం నటాషా నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు వీరికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు.
 

click me!

Recommended Stories