రోడ్డు ప్రమాదంలో జూ.ఆర్టిస్ట్ గాయత్రి మృతి.. సురేఖ వాణి, షణ్ముఖ్ ఎమోషనల్.. పోలీసులు తేల్చింది ఇదే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 20, 2022, 10:06 AM IST

గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి చెందారు.. గాయత్రి మృతిపై నటి సురేఖ వాణి, షణ్ముఖ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.   

PREV
16
రోడ్డు ప్రమాదంలో జూ.ఆర్టిస్ట్ గాయత్రి మృతి.. సురేఖ వాణి, షణ్ముఖ్ ఎమోషనల్.. పోలీసులు తేల్చింది ఇదే

రెప్పపాటు కాలంలో జరిగే ప్రమాదాలు జీవితాలనే తారుమారు చేస్తుంటాయి. అందుకే ముందు జాగ్రత్త ఎంతైనా అవసరం అని చెబుతుంటారు. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. సినీ ప్రముఖులు కూడా రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. గత ఏడాది మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ నుంచి పడిన సంగతి తెలిసిందే. అదృష్టం బావుండి తేజు ఆ ప్రమాదం నుంచి కోలుకున్నాడు. 

 

26

తాజాగా హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో 27 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మరణం అందరిని కలచి వేస్తోంది. చిత్ర పరిశ్రమని విషాదంలోకి నెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయత్రి గచ్చిబౌళి ప్రాంతంలో తన స్నేహితుడు రోహిత్ తో కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయత్రి ప్రాణాలు విడిచింది. రోహిత్ తీవ్రగాయాలపాలయ్యాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

36

వీరిద్దరూ శుక్రవారం హోలీ సందర్భంగా ప్రిసం పబ్ కి వెళ్లారు అని తిరిగి వెళ్లే క్రమంలో కారు అతి వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 100-120 కిమీ వేగంతో ప్రయాణిస్తోందని మాదాపూర్ పోలీసులు మీడియాకు తెలిపారు. 

 

46

రోహిత్ కారు డ్రైవ్ చేశాడని.. అతడి పక్క సీట్ లో గాయత్రి కూర్చుని ఉంది. కారు ఫుట్ పాత్ ని ఢీ కొట్టడంతో ముందు టైర్లు ఊడిపోయాయి. క్షణాల్లో కారు పల్టీలు కొడుతూ దూరంగా పడింది. అద్దాలు పగిలిపోవడంతో గాయత్రీ కారులో నుంచి రోడ్డుపై పడి మృతి చెందినట్లు పోలీసులు తెలుపుతున్నారు. 

 

56

గాయత్రి 27 ఏళ్ల అతి పిన్న వయస్కురాలు. పబ్ నుంచి వచ్చే సమయంలో వీరిద్దరూ మద్యం సేవించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గాయత్రికి టాలీవుడ్ లో చాలా మందితో పరిచయం ఉంది. గాయత్రి మరణించిన వార్త తెలియడంతో నటి సురేఖ వాణి విషాదంలో మునిగిపోయారు. గాయత్రితో ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది అంటూ ఆమె ఎమోషనల్ కామెంట్స్ పోస్ట్ చేశారు. గతంలో సురేఖ వాణి తనకు రెండవ తల్లి లాంటివారు అని గాయత్రీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ని సురేఖ వాణి ఇప్పుడు కోట్ చేశారు. 

 

66

షణ్ముఖ్ కూడా గాయత్రి మృతిపై విచారం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ తో గాయత్రికి మంచి స్నేహం ఉంది. ఇదిలా ఉండగా వీరి కారు పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న హోటల్ మహేశ్వరి అనే మహిళపై పడింది. దీనితో ఆమె కూడా ప్రాణాలు విడిచారు.  

 

click me!

Recommended Stories