Published : Apr 22, 2024, 07:00 AM ISTUpdated : Apr 22, 2024, 07:02 AM IST
హీరో నాగ చైతన్య - శోభిత దూళిపాళ్ల మరోసారి దూరంగా ఎక్కడికో చెక్కేశారనే పుకార్లు మొదలయ్యాయి. నాగ చైతన్య చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ అనుమానాలకు దారి తీసింది.
నాగ చైతన్య హీరోయిన్ సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2021లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. అప్పటి నుంచి నాగ చైతన్య సింగిల్ గానే ఉంటున్నాడు.
27
Naga Chaitanya-Sobhita Dhulipala
అయితే తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో ఆయన సన్నిహితంగా ఉంటున్నాడంటూ పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. శోభిత ధూళిపాళ్లను తరచుగా కలుస్తున్న నాగ చైతన్య తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి తీసుకువెళ్లేవాడని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి.
37
Naga Chaitanya-Sobhita Dhulipala
ఈ పుకార్లకు బలం చేకూర్చేలా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. లండన్ వెళ్లిన నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. అక్కడి ఇండియన్ రెస్టారెంట్ కి వీరు వెళ్లారు. చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో దూరంగా కూర్చుని ఉన్న శోభిత ధూళిపాళ్ల కూడా కనిపించింది.
47
Naga Chaitanya-Sobhita Dhulipala
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఫోటోని ఆ చెఫ్ డిలీట్ చేశాడు. అలాగే వీరిద్దరూ విదేశాల్లో పక్కపక్కనే నిల్చుని దిగిన ఫోటో కూడా ఒకటి వైరల్ అయ్యింది. ఈ క్రమంలో నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారనే అనుమానాలు బలపడ్డాయి.
57
Naga Chaitanya-Sobhita Dhulipala
తాజాగా నాగ చైతన్య ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఆయన సాయంత్రపు సూర్యకిరణాలు ఆస్వాదిస్తున్న ఫోటో పెట్టారు. ఈ సాదాసీదా ఫోటోపై శోభిత ధూళిపాళ్ల స్పందించింది. ఒక లైక్ కొట్టింది. దాంతో ఆ ఫోటో తీసిన సందర్భంలో పక్కనే శోభిత కూడా ఉండొచ్చు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఎక్కడికో చెక్కేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
67
Naga Chaitanya-Sobhita Dhulipala
అయితే నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల మీద వచ్చే ఈ రూమర్స్ ని ఆయన టీమ్ ఖండిస్తున్నారు. నాగ చైతన్య మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎప్పుడూ దీనిపై ఆయన స్పందించలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా చందూ మొండేటి దర్శకుడు.
77
Naga Chaitanya-Sobhita Dhulipala
శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ అమెరికాలో విడుదల అయ్యింది. త్వరలో ఇండియాలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర చేయడం విశేషం.