16 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ..ఆమెతో డ్యాన్స్ చేసిన స్టార్ హీరోకి మోకాళ్ళు వాచిపోయాయి, ఏం జరిగిందంటే..

First Published | Oct 17, 2024, 12:07 PM IST

హీరోయిన్లు చాలా మంది టీనేజ్ లోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు. టీనేజ్ లో నటిగా మారి సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించిన వాళ్లలో శ్రీదేవి, జయసుధ లాంటి వాళ్ళు ఉన్నారు.

హీరోయిన్లు చాలా మంది టీనేజ్ లోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు. టీనేజ్ లో నటిగా మారి సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించిన వాళ్లలో శ్రీదేవి, జయసుధ లాంటి వాళ్ళు ఉన్నారు. వీరి తర్వాత జనరేషన్ లో రంభ లాంటి అందాల తారలు టాలీవుడ్ లో సందడి చేశారు. హీరోయిన్ రంభ పేరుకు తగ్గట్లుగానే తన గ్లామర్ తో, నటనతో ప్రేక్షకులను అలరించింది. 

ఆమె నటించిన తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్. రాజేంద్ర ప్రసాద్ సరసన, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రంభ నటించిన తొలి చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలయ్యే సరికి రంభ వయసు 16 ఏళ్ళు. సరిగ్గా 16 ఏళ్ళు పూర్తి కాకముందే రంభ నటన ప్రారంభించింది. ఆ తర్వాత రంభకు టాలీవుడ్ లో తిరుగులేకుండా పోయింది. 


దీనితో నెమ్మదిగా రంభకు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ మొదలయ్యాయి. 18 ఏళ్ళ వయసులోనే నందమూరి బాలకృష్ణతో భైరవద్వీపం చిత్రంలో నరుడా ఓ నరుడా అంటూ స్పెషల్ సాంగ్ చేసింది. ఆమె డ్యాన్స్ ప్రతిభకి, గ్లామర్ కి అంతా ఫిదా అయ్యారు. వెంకటష్ సరసన నటించి ముద్దుల ప్రియుడు చిత్రంతో మరో హిట్ అందుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో అయితే అల్లుడా మజాకా, హిట్లర్, బావగారు బావున్నారా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

Also Read : ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు చెబుతూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు.. ఎందుకూ పనికిరారు అనుకునే వాళ్ళు అంటూ..

కెరీర్ బిగినింగ్ లో ప్రారంభించిన స్పెషల్ సాంగ్స్ కల్చర్ ని రంభ వదిలిపెట్టలేదు. పవన్ కళ్యాణ్  అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. హలో బ్రదర్, మృగరాజు లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. హీరోయిన్ గా కెరీర్ కి ఫుల్ స్టాప్ పడ్డ తర్వాత కూడా రంభ.. అల్లు అర్జున్ దేశముదురు చిత్రంలో.. ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో ఐటెం సాంగ్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో రంభ కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు నటించిన హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని అడుగగా.. నా ఆల్ టైం ఫేవరిట్ మెగాస్టార్ చిరంజీవి అని తెలిపింది. 

అయితే చిరంజీవి కాకుండా ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే పిచ్చి అని పేర్కొంది. ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పేయొచ్చు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతా. ఎంతలా కష్టపడతారు అంటే.. యమదొంగలో నాచోరో నాచోరే సాంగ్ కోసం చాలా కష్టమైన స్టెప్పులు వేయాలి. మోకాళ్ళు అదిరిపోతున్నా, వాచిపోతున్నా ఎన్టీఆర్ లెక్క చేయలేదు. సాంగ్ కంప్లీట్ చేశారు. అంత డెడికేషన్ ఉన్న నటుడికి ఎవరైనా ఫిదా కావలసిందే అని రంభ ప్రశంసలు కురిపించింది. 

Latest Videos

click me!