అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న అవికా గోర్‌.. `పాప్‌కార్న్`తో ఆ ప్రయోగం ఫలించేనా?

Published : Feb 08, 2023, 04:13 PM IST

ఆ మధ్య `టెన్త్ క్లాస్‌ డైరీస్‌`, `థ్యాంక్యూ` చిత్రాల్లో నటించింది Avika gor. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు మరోసారి సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

PREV
17
అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న అవికా గోర్‌.. `పాప్‌కార్న్`తో ఆ ప్రయోగం ఫలించేనా?

చిన్నారి పెళ్లికూతురుగా అందరికి పరిచయమైంది అవికా గోర్‌. తెలుగులోనే కాదు, ఇండియా వైడ్‌గా ఆమె పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్‌గానూ మంచి విజయాలు అందుకుంది. కానీ కొన్ని అపజయాలు, కొంత బాడీపై నిర్లక్ష్యంగా ఆమెని సినిమాలకు దూరంగా చేసింది. కానీ వెంటనే తేరుకుంది. తనని తాను మలుచుకుని ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది. 
 

27

ఆ మధ్య `టెన్త్ క్లాస్‌ డైరీస్‌`, `థ్యాంక్యూ` చిత్రాల్లో నటించింది Avika gor. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు మరోసారి సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ `పాప్‌ కార్న్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కాబోతుంది. ఇందులో సాయి రోనక్‌తో కలిసి రొమాన్స్ చేసింది అవికా గోర్‌. దీనికి మురళీ గంధం దర్శకత్వం వహించారు.
 

37

అయితే ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. దీనికి అవికా గోర్‌ నిర్మాత కావడం విశేషం. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా మారారు. అవికా స్క్రీన్‌ క్రియేషన్స్ బ్యానర్‌ని స్థాపించింది. ఎంఎస్‌ చలపతిరాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్ తో కలిసి భోగేంద్ర గుప్తాతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం. సినిమా రిలీజ్‌కి దగ్గరపడుతుంది. మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది. 
 

47

ఇక ఈ సినిమాతో రెండు రకాలుగా తన లక్‌ ని టెస్ట్ చేసుకోబోతుంది అవికా. ఓవైపు హీరోయిన్‌గా సక్సెస్‌ కోసం ప్రయత్నిస్తుంది. చాలా కాలంగా ఈ బ్యూటీకి హిట్‌ లేదు. దీంతో ఒక్క హిట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంది. అందుకోసం నిర్మాతగానూ మారిందని చెప్పొచ్చు. మరోవైపు నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం, ప్రయోగం ఈసినిమా. సినిమా సక్సెస్‌ అయితే నిర్మాతగానూ ఆమె సక్సెస్‌ అవుతుందని చెప్పొచ్చు. మున్ముందు మరిన్ని సినిమాలు నిర్మించనుంది. అదే ఫలితం తేడా కొడితే పరిస్థితులన్నీ మొదటకొస్తాయి. మరి `పాప్ కార్న్` ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 

57

`పాప్ కార్న్`  సెన్సార్‌ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది.  సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య చేతులు మీదుగా రిలీజ్ చేయించిన మది విహంగమాయే పాట శ్రోతలను ఆకట్టుకుంది.
 

67

సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించిన అవికా గోర్ మాట్లాడుతూ .. ‘ఇది ఒక డిఫరెంట్ మూవీ అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారనే న‌మ్మ‌కం ఉంది’ అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చింది. థియేటర్లో ఉన్న ఆడియెన్స్‌కు చివ‌రి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఉంటుంద’ని అన్నారు. ‘పాప్ కార్న్’ మూవీ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి. 
 

77

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం హీరో సాయిరోనక్‌తో కలిసి చేసిన ఫోటో షూట్‌ పిక్స్ ఆకట్టుకుంటుంది. ఇందులో అవికా గోర్‌ అందాల విందు మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. క్లీవేజ్‌ షోతో కుర్రాళ్లని మతిపోగొడుతుందీ చిన్నారి పెళ్లి కూతురు. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories