ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న ప్రియమణి.. ఈ అందానికి ఫిదా అయిన ఫ్యామిలీ హీరోయిన్.. క్రేజీ కామెంట్!

First Published | Feb 8, 2023, 4:07 PM IST

టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి (Priyamani) గ్లామర్ మెరుపులతో కట్టిపడేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూనే అందాలను విందు చేస్తోంది. తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది.
 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్లలో అందాల సుందరి ప్రియమణి ఒకరు. కొన్నేండ్ల పాటు టాలీవుడ్ లో వరుస చిత్రాలతో ఊపూపిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సెకండ ఇన్నింగ్స్ ను మొదలెట్టింది. 
 

ఈ సందర్భంగా హీరోయిన్ గానే కాకుండా ముఖ్య పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సీనియర్ నటి ప్రియమణి. అదేవిధంగా బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఢీ’షోతో ఇప్పటికే జడ్జీగా అలరించింది.
 


ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఓటీటీ ఫిల్మ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.
 

మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోందీ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో అందాలను విందు చేస్తూ నెటిజన్ల మతులు పోగొడుతోంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకున్నారు. 
 

తాజాగా ప్రియమణి లెహంగా, వోణీలో మెరిశారు. రంగురంగుల లెహంగా.. స్లీవ్ లెస్ బ్లౌజ్, వోణీలో కట్టిపడేసింది. ట్రెడిషనల్ అందాలతో యువతను చిత్తు చేసింది. ఈ సందర్భంగా ప్రియమణి ఇచ్చిన స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

వయస్సు పెరుగుతున్నా.. అందంలో ఏమాత్రం తగ్గడం లేదంటూ ప్రియమణిని పొగుడుతున్నారు. తన ఫొటోలపై సీనియర్ నటి, ఫ్యామిలీ హీరోయిన్ స్నేహా కూడా స్పందించారు. ‘ఎందుకు ఇంత అందంగా ఉన్నావు’ అంటూ తన ఫొటోషూట్ పై కామెంట్ చేశారు. 

నిజానికి సంప్రదాయ దుస్తుల్లో ప్రియమణి చాలా అందంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక లెహంగాలో మెరిసి మరింత యంగ్ గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ , కామెంట్లతో ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

ఇక ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు. గతేడాది ‘భామాకలాపం’, ‘విరాటపర్వం’తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్య ‘కస్టడీ’లో నటిస్తున్నారు. అలాగే తమిళం, కన్నడ, హిందీలో కలిసి నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

Latest Videos

click me!