Avika Gor: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అవికా గోర్ ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా మెప్పించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అవికా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
తాజాగా అవికా గోర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో అవికా గోర్ తన భర్త మిలింద్ చంద్రవాణితో కలిసి ఓ ఈవెంట్‌ను నుంచి బయటకు వస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ జంటను తమ కెమెరాల్లో బందిస్తున్నారు. అయితే కాసేపు నవ్వుతూ కనిపించిన అవికా మొహం ఒక్కసారిగా మారిపోయింది. కడుపును పట్టుకుని పక్కకు వెళ్లి వాంతి చేస్తున్నట్లుగా కనిపించింది. ఆ సమయంలో మిలింద్ ఫొటోగ్రాఫర్లను ఫొటోలు తీయొద్దంటూ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ చిన్న సంఘటననే చూసి చాలా మంది అభిమానులు అవికా గర్భవతి అయ్యి ఉండొచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ప్రారంభించారు.
25
నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నెటిజన్ల స్పందన రెండు విధాలుగా కనిపించింది. కొంతమంది అభిమానులు “ఇది గుడ్ న్యూస్ అయి ఉండొచ్చు” అని భావించారు. అయితే మరికొందరు మాత్రం ఇది నిజం కాదని, కేవలం నటన మాత్రమేనని వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు “ఇది పబ్లిసిటీ కోసం చేసిన ప్రాంక్ అయి ఉండొచ్చు” అని కూడా కామెంట్స్ చేశారు. మరికొందరు “ఇది నిజమైన సంఘటనలా అనిపించడం లేదు” అంటూ వీడియోపై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.
35
రియాలిటీ షోలో అవికా వివాహం
అవికా గోర్ తన స్నేహితుడు మిలింద్ చంద్వానీని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పెళ్లి ఒక రియాలిటీ షోలో జరిగింది. పతి పత్ని ఔర్ పంగా అనే రియాలిటీ షోలో ఈ జంట పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెద్దగా చర్చకు దారితీసింది. అందుకే ఇప్పుడు వైరల్ అయిన ఈ వీడియో కూడా ఏదైనా ప్రాజెక్ట్ లేదా ప్రాంక్ కోసం కావొచ్చని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అవికా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. 2026 జనవరిలో కూడా అవికా గోర్ గర్భవతి అన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. ఆ సమయంలో అవికా ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. “ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. అలాంటిదేమీ లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
55
అసలేం జరిగింది.?
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై అవికా గోర్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అందువల్ల ఇది నిజంగా గర్భధారణకు సంబంధించిన విషయం కాదా, లేక సాధారణ సంఘటననా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అవికా నిజంగానే గర్భందాల్చారా.? లేదా అనారోగ్య కారణంతో వాంతి చేసుకున్నారా.? లేదా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నట్లు ఇది ప్రాంక్ వీడియోనా క్లారిటీ రావాలంటే అవికా అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.