హిందీ సీరియల్ బాలికా వధు తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అవికా గోర్, దేశవ్యాప్తంగా కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు. ఏళ్ల తరబడిన సాగిన ఆ సీరియస్ ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది .
ఆ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు అవికా. మార్నింగ్ వాక్, పాఠశాల, తేజ్ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ లో మొదటి చిత్రం చేశారు అవికా. రాజ్ తరుణ్ డెబ్యూ మూవీ ఉయ్యాలా జంపాలా చిత్రంలో అవికా హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం జరిగింది.
ఆ తరువాత సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించారు.
2019లో విడుదలైన రాజుగారి గది 3 అవికా చివరి చిత్రం కాగా , మరో రెండు తెలుగు చిత్రాలు చేస్తున్నారని సమాచారం.
ఇక కొద్దిరోజుల క్రితం మిలింద్ చాంద్వాని అనే వ్యక్తి ప్రేమలో ఉన్నట్లు అవికా గోర్ ఓపెన్ గా చెప్పేశారు. అతనితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ అందరికీ షాక్ ఇచ్చారు.
కాగా అవికా నటుడు ఆదిల్ ఖాన్ ని చర్చ్ లో వివాహం చేసుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటో అవికా గోర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నారు.
మిలిందాను ప్రేమించి ఆదిల్ ఖాన్ ని వివాహం చేసుకోవడం ఏమిటని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే ఆ ఫోటో ఓ షూట్ లో భాగమని తెలుసుకొని తరువాత కూల్ అయ్యారు.
కాదిల్ అనే ఓ సాంగ్ షూటింగ్ లో భాగంగా అవికా, ఆదిల్ అలా నవదంపతులుగా కనిపించారు. ఆ సాంగ్ త్వరలో విడుదల కాబోతుందని సమాచారం ఇస్తూ అవికా సదరు ఫోటో ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.
అవికా గోర్ ఇంస్టాగ్రామ్ ఫోటో
అవికా గోర్ ఇంస్టాగ్రామ్ ఫోటో
అవికా గోర్ ఇంస్టాగ్రామ్ ఫోటో
అవికా గోర్ ఇంస్టాగ్రామ్ ఫోటో