బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో క్రేజీ లవ్ కపుల్‌గా అఖిల్, మోనాల్ నిలిచారు. వీరిద్దరు లవ్ స్టోరీనే హౌజ్‌లో హైలైట్‌గా మారింది. డే మొత్తంలో వీరి గురించిన డిస్కషనే ఎక్కువగా జరిగేది. షో ముగిసేంత వరకు వీరిద్దరు ప్రేమ పక్షులుగా ఉన్నారు. ఒకరినొకరు పులిహోర కలుపుకున్నారు.
షో అయిపోయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఆ రిలేషన్ కొనసాగుతూనే ఉంది. ఒకరికొకరు గిఫ్ట్ లు ఇచ్చుకోవడం చేస్తూనే ఉన్నారు. బిగ్‌బాస్ ఉత్సవంలోనూ మోనాల్‌కి కాళ్ల గజ్జలు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు అఖిల్.
అంతేకాదు వీరిద్దరు కలిసి `తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి` పేరుతో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీంతో వీరిమధ్య ప్రేమ వ్యవహారం మరింత ముందుకెళ్తుందనే టాక్ వినిపిస్తుంది.
మరోవైపు వీరిద్దరు ఏమాత్రం అవకాశం దొరికిన తమ మధ్య రొమాన్స్ ని వ్యక్తం చేసుకుంటున్నారు. ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. బయటకు స్నేహితులమని చెప్పుకుంటూనే సీక్రెట్ లవ్ స్టోరీని రన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోసారి అఖిల్, మోనాల్ మధ్య ప్రేమ వ్యవహారం బయటపడింది. ఈ సారి అఖిల్ కవితాత్మకంగా చెప్పి కవిగా మారాడు. మోనాల్‌తో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం అఖిల్.. `మా సంతోషం ఇలా ఉందం`టూ లవ్ ఎమోజీని జత చేశాడు. దీంతోపాటు `ప్రేమ క్యాన్సర్ వంటిది.. అది మరిచిపోయినట్టు చేస్తుంది.. చివరకు ప్రాణాలను తీసుకెళ్లిపోతోంది` తన కవి హృదయాన్ని బయటపెట్టాడు.
మోనాల్‌ని ఉద్దేశించే అఖిల్ ఇలా పోస్ట్ పెట్టారని తెలుస్తుంది. దీంతో అఖిల్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఇద్దరి ప్రేమ కథ ఏ తీరం చేరుతుందో చూడాలి.
ప్రస్తుతం మోనాల్ స్టార్ మాలో `డాన్స్ ప్లస్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది.