పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన విక్కీనయన్‌ జంట.. రజనీ, షారూఖ్‌, సూర్య, విజయ్‌సేతుపతి.. తారల సందడి.. ప్యాన్స్ ఖుషి

Published : Jul 10, 2022, 06:31 PM ISTUpdated : Jul 11, 2022, 03:02 PM IST

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, విఘ్నేష్‌ శివన్ పెళ్లి గత నెలలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. నార్త్ నుంచి సౌత్‌ వరకు తారాలోకం దిగొచ్చింది. ప్రస్తుతం ఆయా ఫోటోలను విఘ్నేష్‌ పంచుకోగా వైరల్‌ అవుతున్నాయి. 

PREV
112
పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన విక్కీనయన్‌ జంట.. రజనీ, షారూఖ్‌, సూర్య, విజయ్‌సేతుపతి.. తారల సందడి.. ప్యాన్స్ ఖుషి

తారలు దిగివచ్చిన వేళ.. వేడుక అంతా కళ్ల సంబురంగా మారుతుంది. అలాంటి కనువిందు చేసే సందర్భంగా నయనతార, విఘ్నేష్‌ శివన్‌ మ్యారేజ్‌ వేడుకలో జరిగింది. రజనీకాంత్‌, మణిరత్నం,షారూఖ్‌ ఖాన్, సూర్య, విజయ్‌ సేతుపతి, రెహ్మాన్‌, ఎస్‌ జే సూర్య, జ్యోతిక, అనిరుథ్‌ రవిచంద్రన్‌, అట్లీ వంటి తారలు కదిలి వచ్చారు.

212

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ జూన్‌ 9న గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలో వీరి వివాహం చాలా వైభవంగా జరిగింది. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు కేవలం అతికొద్ది మంది బంధుమిత్రులతో ప్రైవేట్‌ ఈవెంట్‌గా పెళ్లి చేసుకుంటుండగా, నయన్‌-విక్కీ జోడీ మాత్రం సెలబ్రిటీలు, బంధువులకు వెడ్డింగ్‌ కార్డులు ఇచ్చి మరీ ఆహ్వానించారు.

312

స్వయంగా ఇద్దరు చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానించడం విశేషం. దీంతో ఎంతో ప్రత్యేకంగా, ఆదర్శంగా నిలిచిందీ జంట. అంతేకాదు వేలాది మంది అభిమానులకు భోజనాలు ఏర్పాటు చేయించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు.

412

నయన్‌-విక్కీ పెళ్లి వేడుకకి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హాజరయ్యారు. ఆయనతోపాటు దర్శకుడు మణిరత్నం సైతం ఈ పెళ్ళి వేడుకలో పాల్గొన్నారు. నూతన వధువరులను ఆశీర్వదించి,చిరు కానుకలు అందజేశారు. 

512

నయనతార, విఘ్నేష్‌ శివ గత మూడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయంతెలిసిందే. సీక్రెట్‌గా ప్రారంభమైన వీరి ప్రేమ కొన్ని రోజులకే బహిర్గతం అయ్యింది. వీరిద్దరు కలిసి చాలా రోజులు డేటింగ్ చేసుకున్నారు. డేటింగ్‌ బోర్‌ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటామని తెలిపారు. 

612

అలా ఎట్టకేలకు జూన్‌ 9న మ్యారేజ్‌ చేసుకున్నారు. అనంతరం కొంత గ్యాప్‌తో వీరిద్దరు హనీమూన్‌ వెళ్లారు. హనీమూన్‌లో అన్‌లిమిటెడ్‌గా ప్రేమించుకున్నారు. ఎంజాయ్‌ చేశారు. ఇటీవలే తిరిగొచ్చారు. ఇప్పుడు ఎవరికివారు సినిమాల బిజీలో ఉన్నారు. 

712

స్టార్‌ హీరోయిన్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ మ్యారేజ్‌కి హీరో సూర్య, ఆయన సతీమణి, నటి జ్యోతిక హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. వారితో దిగిన ఫోటో వైరల్‌ అవుతుంది.

812

స్టార్‌ హీరోయిన్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ మ్యారేజ్‌కి మక్కల్‌సెల్వన్‌ విజయ్‌ సేతుపతి పాల్గొన్నారు. వారి పిక్‌సైతం హల్‌చల్‌ చేస్తుంది.

912

స్టార్‌ హీరోయిన్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ మ్యారేజ్‌కి హాజరైన విజయ్‌ సేతుపతి, షారూఖ్‌, సూర్య, ఎస్ జే సూర్య, ఆట్లీ కలిసి నూతన వధువరులతో కలిసి ఇచ్చిన పోజులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 

1012

ఆస్కార్‌ విన్నర్‌, లెజెండరీ సంగీత దర్శకుడు ఎఆర్‌ రెహ్మాన్‌ సైతం నయనతార-విఘ్నేష్‌ శివన్‌ మ్యారేజ్‌కి హాజరయ్యారు. ఇద్దరిని ఆయన ప్రత్యేకంగా ఆశీర్వదించారు. 

1112

సంగీత సునామీ అనిరుథ్‌ రవిచంద్రన్‌ సైతం ఈ మ్యారేజ్‌కి హాజరయ్యారు. ఆయన దిగిన ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా  నెల రోజుల తర్వాత విఘ్నేష్‌ శివన్‌ తమ మ్యారేజ్‌ వెడ్డింగ్‌ ఫోటోలను వరుగా రెండు రోజులుగా పంచుకుంటుండటం విశేషం. 

1212

విఘ్నేష్‌ శివన్‌ పెళ్లి ఫోటోలను పంచుకుంటూ తన మ్యారేజ్‌ కి వచ్చిన గెస్ట్ లకు, ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories