హాలీవుడ్ లో రెమ్యునరేషన్ అందుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా.. పూసగుచ్చినట్టు చెప్పిన అవంతిక!

Published : Mar 18, 2024, 03:41 PM ISTUpdated : Mar 19, 2024, 06:02 PM IST

ఇండియన్ సినిమాల్లో నటించే వారికి రెమ్యునరేషన్ ఎలా అందజేస్తారో మనందరికీ తెలిసిందే. కానీ హాలీవుడ్ లో  పారితోషికం అందుకోవాలంటే ఓ సిస్టమే ఉండటం ఆసక్తికరంగా మారింది. నటి అవంతిక వందనపు ఇలా వివరించారు.

PREV
16
హాలీవుడ్ లో రెమ్యునరేషన్ అందుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా.. పూసగుచ్చినట్టు చెప్పిన అవంతిక!

తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు (Avantika Vandanapu) ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ బాలనటిగా అలరించిన ఈమె అక్కడ వరుసగా అవకాశాలు అందుకుంటోంది.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

26

అమెరికన్ ఓటీటీల్లో తను నటించి చిత్రాలు విడుదలవుతోండటం విశేషం. రీసెంట్ గానే అవంతిక లీడ్ రోల్ లో నటించిన ‘మీన్ గర్ల్’ (Mean Girl) విడుదలైంది. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. 
 

36

తన నటనకు కూడా మంచి ప్రశంసలు అందాయి. తెలుగులోనూ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే... అవంతిక చిత్రం ప్రమోషన్ లో భాగంగా అమెరికన్ మీడియాతో పాటు.. ఇండియా ఛానెళ్లకు కూడా ఇంటర్వ్యూలో ఇస్తూ వస్తోంది. 
 

46

ఈ సందర్భంగా అవంతిక వందనపు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా హాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ పై స్పందించింది. అక్కడ నటీనటులు పారితోషికం అందుకోవాలంటే ఓ ప్రాసెస్ ను తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. 
 

56

ఇండియన్ ఫిల్మ్స్ లో నటిస్తే పీఆర్ ప్రొడక్షన్ హౌజ్ తో రెమ్యునరేషన్ ను డీల్ చేస్తుంటారు. అవకాశాలు కూడా ఇక్కడ నేరుగా వస్తుంటాయి. కానీ హాలీవుడ్ లో మాత్రం ఎంతటి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయినా నెక్ట్స్ మూవీ కోసం తప్పకుండా ఆడిషన్ ఇవ్వాల్సిందేనంట. 
 

66

ఇక ఏజెంట్ నుంచి అవకాశాలు వస్తాయని అవంతిక తెలిపారు. రెమ్యునరేషన్ కోసం ఎంటర్ టైన్ మెంట్ లా చేసిన ప్రాపర్ లాయర్ ఉండాల్సిందేనంట. ఆ లాయరే మొత్తం రెమ్యునరేషన్ కథను నడిపిస్తారని తెలిపారు. ఇక నటుడి పెర్ఫామెన్స్ బాగుంటే.. ఫ్యూచర్ లో వారి సీన్లకు వచ్చే ఇన్ కమ్ పైనా రాయల్టీస్ ఇస్తారని చెప్పారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories