Mahesh Babu-Namrata: నా కోసం మహేష్ ఎప్పుడూ ఆ పని చేయలేదు..? నమ్రత షాకింగ్ కామెంట్స్

Published : Jun 09, 2022, 11:43 AM ISTUpdated : Jun 09, 2022, 12:51 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన సతీమణి నమ్రత. తన కోసం మహేష్ ఏపని చేసింది లేదు అన్నారు. ఇంతకీ నమ్రత ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు. 

PREV
17
Mahesh Babu-Namrata: నా కోసం మహేష్  ఎప్పుడూ ఆ పని చేయలేదు..?  నమ్రత షాకింగ్ కామెంట్స్

ఫిల్మ్ సెలబ్రెటీస్ ఫ్యామిలీ లైఫ్ లో సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ చాలా స్పెషల్. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయిస్తాడు మహేష్. షూటింగ్ లేకుంటే సూపర్ స్టార్ కు ఫ్యామిలీనే లోకం. ఫారెన్ షూట్ కు వెళ్తే.. ఫ్యామిలీ ఉండాల్సిందే. 
 

27

అయితే సూపర్ స్టార్ మహేష్ బిజీగా ఉంటే.. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ నమ్రతనే చూసుకుంటుంది. ఏది చేయాలి అన్నా.. ఆమె. మహేష్ కు సంబధింన విషయాలు కూడా ఆమె చూసుకుంటుంది. అంతే కాని మహేష్ తన కోసం ఏం చేయలేదంటోంది నమ్రత. అయితే తాను బిజీగా ఉండటం వల్లే అంటోంది మాజీ హీరోయిన్. 
 

37

మహేశ్‌ కోసం నేను షాపింగ్‌ చేయాలి తప్ప.. ఆయన నాకోసం ఎప్పుడూ షాపింగ్‌ చేయడు అంటూ చమత్కరించారు నమ్రతా శిరోద్కర్‌. మంగళవారం హైదరాబాద్‌లో తన స్నేహితురాలు ప్రారంభించిన స్టైలింగ్‌ స్టోర్‌ ఓపెనింగ్ కు గెస్ట్ గా వచ్చిన నమ్రత తన వ్యక్తిగత విషయాలతోపాటు మహేశ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

47

మహేశ్‌కు ఖాళీ దొరికితే సరదాగా టూర్స్‌ వేస్తుంటారు. షాపింగ్‌లు చేస్తాం. నచ్చింది తింటాం. కానీ మహేశ్‌ను వెంటేసుకుని షాపింగ్‌ చేయడం మాత్రం ఎప్పుడూ కుదరదు. ఆయన షాపింగ్‌ కూడా నేనే చేస్తా. నాకోసం ఆయన ఏ షాపింగ్‌ చేయడు. మహేశ్‌ నుంచి అలా ఎక్స్‌పెక్ట్‌ చేయడం  కూడా కరెక్ట్‌ కాదు అన్నారు నమ్రత. 

57

మహేష్ తనతో షాపింగ్ చేయకపోవడానికి కూడా కారణం ఉంది.. ఆయనకు  అంత టైమ్‌ ఉండదు. అందుకే ఆ పనులు నేనే చూసుకుంటాను అన్నారు ఆమె. అంతే కాదు తమకు దుబాయ్‌, అమెరికాలో షాపింగ్‌ చేయడం అంటే ఇష్టమట. మా షాపింగ్‌ అంతా అక్కడే ఉంటుంది. నేను ప్రత్యేకంగా స్టైల్‌ ఫాలో కాను. కంఫర్ట్‌గా ఉండే స్టైలింగ్‌ను ఇష్టపడతాను అన్నారు.  
 

67

అంతే కాదు తనకు సంబంధించిన విషయాలు కొన్ని పంచుకున్నారు నమ్రత. ఫ్యాన్స్‌ మళ్లీ నన్ను తెరపై చూడాలనుకుంటున్నారు. కానీ నేను వాళ్లను హర్ట్‌ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఫ్యామిలీని చూసుకోవడంలో బిజీగా ఉన్నా. అందులో నాకు చాలా సంతృప్తి ఉంది. అందుకే సినిమాల వైపు దృష్టి పెట్టడం లేదు అని అన్నారు. 

77

ప్రస్తుతం సూపర్ స్టార్  దంపతులు సర్కారువారి పాట, మేజర్‌ సినిమాల సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫారెన్ టూర్ నుంచి వచ్చారు. ఇక నమ్రత కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories