నయనతారకి సంతాన యోగ్యమే లేదు.. అదంతా పెద్ద డ్రామా.. వేణు స్వామి షాకింగ్‌ కామెంట్స్..

Published : Apr 09, 2024, 04:52 PM ISTUpdated : Apr 09, 2024, 06:05 PM IST

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ సరోగసి ద్వారా పిల్లల్ని కన్న విషయం తెలిసిందే. తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌పై జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.   

PREV
17
నయనతారకి సంతాన యోగ్యమే లేదు.. అదంతా పెద్ద డ్రామా.. వేణు స్వామి షాకింగ్‌ కామెంట్స్..

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండేళ్ల క్రితం వీరి మ్యారేజ్‌ జరిగింది. మ్యారేజ్‌ అయిన కొన్ని నెలలకే వీరిద్దరు ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు. అయితే సరోగసి పద్ధతిలో నయనతార, విఘ్నేష్‌ పేరెంట్స్ అయ్యారు.  
 

27

కానీ ఇది పెద్ద వివాదంగా మారింది. కేసుల వరకు వెళ్లింది. కానీ ముందుగానే వాళ్లు ప్లాన్‌ చేసుకుని వెళ్లడంతో అవన్నీ క్లీయర్ అయ్యాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ హ్యాపీగా ఉన్నారు. అయితే నయనతార ఇలా సరోగసీ ద్వారా పిల్లలు కనడానికి కారణం.. ఆమె అందమే అనే ప్రచారం జరిగింది. 
 

37

హీరోయిన్‌గా నటిస్తున్న నేపథ్యంలో పిల్లలను కంటే తన బాడీ షేప్‌ ఔట్‌ అవుతుందని, బాడీలో వచ్చిన మార్పుల కారణంగా అందం తగ్గిపోతుందని, దీంతో సినిమా అవకాశాలపై ప్రభావం పడుతుందని, అందుకే ఈ మెథడ్‌ని ఫాలో అయ్యారని అంతా అనుకుంటున్నారు. అదే ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. జనరల్‌గా సెలబ్రిటీలు చేసేది కూడా ఇదే. 
 

47

ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ సంచలన, వివాదాస్పదన జ్యోతిష్యుడు వేణు స్వామి బాంబ్‌ పేల్చాడు. నయనతార సంతానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో ఉన్నది అంతా అవాస్తవమని, అసలు కథ వేరే అని చెప్పాడు. అసలు నయనతారకు సంతానయోగ్యమే లేదంటూ షాకిచ్చాడు. ఆమె సంతాన యోగం లేకనే సరోగసిని ఆశ్రయించిందన్నారు. ఆమె జాతకంలో సంతానమే లేదు అంటూ బాంబ్‌ పేల్చాడు. అందం కోసం అంటూ ప్రచారమంతా పెద్ద డ్రామా అని వెల్లడించారు. 
 

57

కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకుని పిల్లలు కని, మళ్లీ ఫిట్‌నెస్‌ తెచ్చుకుని సినిమాలు చేస్తుందా కదా, మరి నయనతారకు అలా చేయడానికి సమస్య ఏంటి? మిగిలిన ఎంత మంది హీరోయిన్లు పిల్లల్ని కని తర్వాత సినిమాలు చేయడం లేదు? నయనతార ఏమో స్ట్రక్చర్స్ కోసం, ఫిజిక్‌ కోసం పిల్లల్ని కనలేదనేది నిజం కాదని, అది తప్పు అని తేల్చిపడేశాడు. తనకు సమస్య ఉందని, దాని కారణంగానే పిల్లల్ని కనలేదని, అందుకే సరోగసిని ఆశ్రయించిందన్నారు వేణు స్వామి. 
 

67

అంతేకాదు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇటీవల సరోగసి ద్వారానే పిల్లల్ని కంటున్నారని, బయటకు ప్రచారం జరిగేదంతే వేరే అని తెలిపారు. అందుకే తాను సంతానానికి సంబంధించిన జాతకం చెప్పడం మానేసినట్టు వేణు స్వామి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఉగాది సందర్భంగా `క్యూబ్ టీవీ`కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి ఈ విషయాలను వెల్లడించారు.

77

నయనతార ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉన్నారు. ఆమె తెలుగులో చివరగా `గాడ్‌ ఫాదర్‌` చిత్రంలో మెరిసింది. `జవాన్‌`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె తమిళంలో `టెస్ట్`తోపాటు మరో సినిమాలో నటిస్తుంది. ఇటు సినిమాలు, అటు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories