ప్రభాస్ #Spirit స్టోరీ లైన్ రివీల్ చేసిన సందీప్ వంగా , సింపుల్ బట్ స్ట్రైయిట్

Published : Apr 09, 2024, 03:10 PM IST

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించిన ఆసక్తికర విషయాలను సందీప్ వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసారు. 

PREV
113
 ప్రభాస్ #Spirit  స్టోరీ లైన్ రివీల్ చేసిన సందీప్ వంగా , సింపుల్ బట్ స్ట్రైయిట్
Spirit

 'యానిమల్' సక్సెస్​తో మంచి ఊపు మీద ఉన్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు ఆయన దృష్టి అంతా  నెక్ట్స్ రెబల్​ స్టార్ ప్రభాస్​తో చేయబోయే స్పిరిట్​పైనే ఉంది. అలాగే ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన విశేషాలును మీడీయా తో చెప్పుకొచ్చారు సందీప్ వంగా. ఆ విశేషాలలో సినిమా స్టోరీ లైన్, బడ్జెట్ ఉండటం విశేషం.

213

వాస్తవానికి యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలా.. స్పిరిట్ లో కూడా విభిన్నమైన పాత్రలో ప్రభాస్ ని చూపిస్తారని నమ్మకంతో ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో ఉన్నారు.

313

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించిన ఆసక్తికర విషయాలను సందీప్ వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసారు. ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుతూ.. “ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో, తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు” అనేది కథని చెప్పుకొచ్చారు.  

413

ఈ క్రమంలో రీసెంట్​గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను 'స్పిరిట్' సినిమా విజయం పట్ల కాన్ఫిడెంట్​గా మాట్లాడారు. ఇప్పటికే సినిమా స్ట్రిప్ట్ 60 శాతం పూర్తైందన్న ఆయన సినిమా ఫస్ట్​ డే కలెక్షన్​ అప్పుడే అంచనా వేసేశారు.  ప్రభాస్ స్టార్​డమ్​తో దేశవ్యాప్తంగా ఓపెనింగ్ రోజే (ఫస్ట్​ డే) రూ.150 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

513
Prabhas

అలాగే స్పిరిట్ బడ్జెట్ విషయానికి వస్తే... దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కనుందని తెలియచేసారు. అలాగే 'స్పిరిట్' సినిమాప్రభాస్​తో మూవీ అనగానే రూ.300+ కోట్లు కూడా ఇన్వెస్ట్​ చేయడానికి ముందుకొచ్చే ప్రొడ్యుసర్లు ఉన్నారని సందీప్ అన్నారు. దాంతో తనకు ఈ సినిమా బడ్జెట్ విషయంలో అసలు ఆలోచించుకోవాల్సిన పనిలేదని తెల్చి చెప్పారు.

613
Prabhas

  భారీ బడ్జెట్​తో రూపొందనున్న స్పిరిట్, ప్రభాస్ ఇమేజ్​తోనే టీజర్, ట్రైలర్, ఆడియో రిలీజ్, ప్రీ ప్రమోషన్స్​తోపాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్​తోనే పూర్తి బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశం ఉందని సందీప్ అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ తో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. 

713
Prabhas

కాగా ఈ సినిమా స్క్రిప్ట్ ని యానిమల్ కంటే ముందే ప్రభాస్ కి వినిపించారట. కరోనా సమయంలో ప్రభాస్ కి ఈ స్టోరీ లైన్ చెప్పగా.. ఆయనకి బాగా నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక 2024 నవంబర్​ లేదా డిసెంబర్​లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సందీప్ అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సందీప్ అన్నారు. స్పిరిట్​కు ముందే ప్రభాస్​తో ఒక హాలీవుడ్ రీమేక్ చేసే అవకాశం వచ్చినా, ఈ సినిమా కోసం దానిని ఒప్పుకోలేదన్నారు. 
 

813

ఇక ఇప్పటికే యానిమల్ సినిమాతో సందీప్ మార్కెట్ పెరిగింది. ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.900 కోట్ల మార్క్ అందుకుంది.ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్​తో సినిమా సందీప్ స్థాయిని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటోంది ట్రేడ్. 

913

ప్రస్తుతం సందీప్ రెడ్డి యానిమల్ సిక్వెల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్​తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న 'కల్కి 2898 AD' మే 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, అనేక  కారణాల వల్ల సినిమా పోస్ట్​పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

1013

అలాగే స్పిరిట్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని వినపడుతోంది. అయితే అక్షయ్ విలన్ గా నటిస్తున్నాడా? లేదా కీలక పాత్ర అని తెలియాల్సి ఉంది. సందీప్ ఇప్పటికే  అక్షయ్ కుమార్ కి కథ చెప్పాడని, అక్షయ్ కూడా కథ నచ్చి ఓకే చేసాడని అంటున్నారు.  ఈ వార్త కనుక  నిజమైతే మరొక బాలీవుడ్ హీరో తెలుగు కి పరిచయం అవుతున్నట్టే.   బాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు సౌత్  లో విలన్స్ గా ఓ వెలుగు వెలుగుతున్న నేపధ్యంలో అక్షయ్ ఎంట్రీ కూడా సరైన డెసిషనే. 
    

1113

 స్పిరిట్ మూవీ షూటింగ్ 2024లో ప్రారంభమై 2025 లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు.  స్పిరిట్ మూవీని టీసిరీస్  తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.    స్పిరిట్  చిత్రాన్ని  2025 క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. సెప్టెంబరు 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని, ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ, ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ప్రకటించాడు సందీప్.

1213

నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ...‘‘  ‘స్పిరిట్‌’చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు 

1313
Prabhas in Kalki 2898 AD film

  ప్రభాస్ ప్రస్తుతం  అటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె', దర్శకుడు మారుతి తో మరో  చిత్రంలోనూ నటిస్తున్నారు.  అయితే, ప్రభాస్ ను పోలీస్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే 'స్పిరిట్' చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? ప్రభాస్ ను ఎప్పుడు ఖాకీ డ్రెస్ లో చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories