కృష్ణ, ఏఎన్నార్‌ మధ్య గొడవలు.. ఎన్టీఆర్‌ నోటీసులు.. అన్నపూర్ణ స్టూడియో కట్టడం వెనుక ఇంత కథ ఉందా?!

First Published Apr 9, 2024, 2:14 PM IST

అన్నపూర్ణ స్టూడియో నిర్మించడం వెనుక పెద్ద కథే ఉంది. ఏఎన్నార్‌, కృష్ణల మధ్య గొడవల, ఎన్టీఆర్‌ ఇన్‌వాల్వ్ మెంట్‌.. ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌, షాకింగ్‌ విషయాలున్నాయట. 
 

ఏఎన్నార్‌(అక్కినేని నాగేశ్వరరావు).. హైదరాబాద్‌ నడిబొడ్డున్న సినిమాల నిర్మాణం కోసం అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. స్టూడియో ల్యాండ్ లీజ్‌ తీసుకుని నిర్మించారని, తర్వాత ఏడు ఎకరాల్లో స్టూడియో నిర్మించారట ఏఎన్నార్‌. కేవలం నాలుగు నెలల్లోనే ఈ స్టూడియో నిర్మాణం చేశారట. అత్యంత వేగంగా ఈ నిర్మాణం జరిగిందట. నాగేశ్వరరావు తన సినిమాలను ఇందులోనే షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. 
 

అయితే ఏఎన్నార్‌ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కథ ఉంది. చాలా గొడవలున్నాయి. ఇందులో పెద్ద స్టార్స్ ఇన్‌వాల్వ్ మెంట్‌ ఉండటం విశేషం. మరి ఆ కథేంటో చూస్తే.. ఏఎన్నార్‌ `దేవదాస్‌` లవ్‌ స్టోరీస్‌లో అప్పట్లో ఓ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ మూవీస్‌లో అదొకటి. మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా `దేవదాస్‌` మూవీ చేశాడు. ఇక్కడే ఇద్దరి మధ్య గొడవలయ్యాయి. 
 

Latest Videos


కృష్ణ `దేవదాస్‌` మూవీ విడుదల సమయంలో.. ఏఎన్నార్‌ నటించిన `దేవదాస్‌`ని కూడా విడుదల చేశారట. ఆ సినిమా ప్రభావం తమకి కూడా పనికి వస్తుందని ఆ మూవీని కొన్న నిర్మాతలు మళ్లీ రిలీజ్‌ చేశారట. దీంతో కృష్ణ `దేవదాస్‌`పై చాలా ప్రభావం పడింది. దీంతో నవయుగ పిక్చర్స్ వాళ్లు కృష్ణ దేవదాస్‌కి డబ్బులు సప్లై చేశారట. కృష్ణ, సారధి స్టూడియో, నవయుగ వాళ్లు అంతా ఒక్కటయ్యారట. అలా ఏఎన్నార్‌తో, కృష్ణకి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. 
 

దీనికి కారణంగా ఏఎన్నార్‌కి, సారథి స్టూడియో వారికి మధ్య గొడవలు వచ్చాయి. ఆ సమయంలో అమెరికా నుంచి అక్కినేని నాగేశ్వరరావు తిరిగి వచ్చాక.. అంజలిదేవి `మహాకవిక్షేత్రయ్య` సినిమాకి నాగేశ్వరరావు డేట్స్ అడిగిందట. సినిమా చేయాలనుకున్నారు. కానీ హైదరాబాద్‌లో స్టూడియోస్‌ ఖాళీగా లేవు. మైసూర్‌లో ఛాముండేశ్వరి స్టూడియో తీసుకుందట. ఆ సమయంలోనే అక్కినేనికి తానే స్టూడియో కడితే పోలే అనుకున్నాడట. 
 

తన సినిమాలకు స్టూడియో ఉండాల్సిందే, మిగిలిన వాళ్లు ఇవ్వరు అని భావించిన ఏఎన్నార్‌.. అప్పుడు సీఎంని కలిసి ఇలా స్టూడియో పర్మీషన్‌ తీసుకున్నారట. అలా కేవలం నాలుగు నెలల్లోనే అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం చేసి రికార్డు సృష్టించారట. అంతేకాదు వెనకాల ఉన్న ఏడెకరాలు స్టూడియో విషయంలోనూ గొడవలు వచ్చాయట.
 

అప్పుడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్‌ దానికి నోటీసులు కూడా పంపించారట. ఈ స్టూడియో కోసం ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కోర్ట్ కి ఎక్కి గొడవ పడ్డారట. ఈ విషయాలను సీనియర్‌ జర్నలిస్ట్, నటుడు ఎస్వీ రామారావు తెలియజేశారు. అన్నపూర్ణ స్టూడియో కట్టాల్సింది కాదట, కానీ ఈ గొడవల వల్ల ఏఎన్నార్‌ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. మరి ఈ స్టూడియో వెనుక ఇంత కథ ఉండటం విశేషం. ఇదిప్పుడు ఆసక్తికరంగా మారడం, ఇందులో కృష్ణకి, ఏఎన్నార్ కి ఉన్న గొడవలు రావడం ఆశ్చర్యంగా మారింది. 

click me!