బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఏసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీపై కామెంట్స్ చేశారు. ఏజెంట్ మూవీ నుంచి తమని దేవుడే కాపాడాడు అంటూ సునీల్ నారంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' ఏజెంట్ సినిమా హక్కులు కొందామని నిర్మాత అనిల్ సుంకరని సంప్రదించాం. కానీ నిర్మాత చాలా పెద్ద ధర డిమాండ్ చేశారు. తాము ఆలోచించుకుని ఈ రేటు వర్కౌట్ కాదులే అని నిర్ణయించుకున్నాం. అంత రేటుకి మేము కొనడం లేదు.. వేరేవాళ్లకు ఇచ్చేయండి అని చెప్పేశాం. ఏజెంట్ మూవీ విషయంలో మమ్మల్ని దేవుడే కాపాడాడు అని భావించాలి' అంటూ సునీల్ నారంగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.