న్యూస్ పేపర్ లో చుట్టి డబ్బు వెనక్కి ఇచ్చేసిన ఎన్టీఆర్..ఎందుకంటే, 'కల్కి' నిర్మాత కామెంట్స్

First Published Jun 14, 2024, 5:48 PM IST

ప్రస్తుతం అశ్విని దత్ ప్రభాస్ తో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కల్కి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశం మొత్తం కల్కి కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో అశ్విని దత్ తన గత అనుభవాలని పంచుకున్నారు.

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ ఓ అశ్విని దత్ ఒకరు. వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాపించిన అశ్విని దత్ దాదాపు 50 ఏళ్ళ నుంచి సినిమాలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో ఆయన చిత్రాలు నిర్మించారు. జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతమైన చిత్రాలు ఈయన బ్యానర్ నుంచే వచ్చాయి. 

ప్రస్తుతం అశ్విని దత్ ప్రభాస్ తో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కల్కి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశం మొత్తం కల్కి కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో అశ్విని దత్ తన గత అనుభవాలని పంచుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి తాను క్రమశిక్షణ, డబ్బు విషయంలో జాగ్రత్త నేర్చుకున్నట్లు తెలిపారు. 

నిర్మాత డబ్బు రూపాయి కూడా వృధా కావడానికి ఎన్టీఆర్ గారు ఇష్టపడేవారు కాదు. ఏఎన్నార్ గారు కూడా అంతే. చాలా మంది హీరోలు తమ సినిమాకి భారీ బడ్జెట్ పెడితే బావుంటుందని అనుకుంటారు. కానీ ఎన్టీఆర్ గారు.. బడ్జెట్ జాగ్రత్తగా చూసుకోండి అని నిర్మాతలని హెచ్చరించేవారు. 

ఆయనతో ఎదురులేని మనిషి చిత్రాన్ని నిర్మించా. ఆ చిత్రానికి వాణిశ్రీ బాగా ఎక్కువగా డిమాండ్ చేశారు. సాధారణంగా ఎన్టీఆర్ గారు అప్పట్లో తీసుకుంటున్నది 2 లక్షలు. వాణి శ్రీ కూడా దాదాపుగా అదే రేంజ్ లో తీసుకున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారికి 1.75 లక్షలు ఇచ్చా. హీరోయిన్ ఎక్కువ తీసుకుంది కాబట్టి ఎన్టీఆర్ కి కూడా 2 లక్షలే ఇస్తే ఏం బావుంటుంది అని 2.25 లక్షలు ఇచ్చేదాం అనుకున్నా. 

మిగిలిన 50 వేల రూపాయలు తీసుకుని ఆయన వద్దకి వెళ్ళా. ఆయన చూసి ఏంటి ఎక్కువ తెచ్చినట్లు ఉన్నావ్ అన్నారు. ఇంత ఎందుకు మనం తీసుకునేది రెండే కదా అని 50 వేల లోనుంచి 25 వేలు తీసుకున్నారు. మిగిలిన 25 వేలని అక్కడే ఉన్న న్యూస్ పేపర్ లో చుట్టి వెనక్కి ఇచ్చేశారు అని అశ్విని దత్ గుర్తు చేసుకున్నారు. 

కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్, ఎన్నార్ మాట్లాడుకుని నిర్మాతల కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు కూడా అశ్విని దత్ తెలిపారు. ఆయన దగ్గర తాను చాలా భయంతో వినయంతో మసులుకునేవాడిని అని అశ్విని దత్ తెలిపారు. 

Latest Videos

click me!