కర్ణుడి చావుకి వేయి కారణాలు అన్నట్లు ప్రస్తుతం థియేటర్స్ కి ప్రేక్షకులు రాకపోవడం కూడా అలాంటిదే అని అన్నారు. కరోనా, ఓటిటి, టికెట్ ధరలు పెంచడం, తగ్గించడం ఇలా అనేక కారణాలు ప్రభావం చూపాయి అని అన్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక సెక్షన్ అయితే వాళ్లే థియేటర్స్ తీసుకుని, అందులో సమోసాలు కూడా వాళ్లే అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు అని అశ్వినీదత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.