పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 2 మంగళవారం రోజు పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దీనితో సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు, చిరంజీవి లాంటి వారంతా పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.