1000 కోట్ల బడ్జెట్, 120 దేశాల్లో మహేష్ గ్లోబ్ ట్రోటర్ రిలీజ్.. కెన్యా నుంచే మార్కెటింగ్ మొదలుపెట్టిన జక్కన్న

Published : Sep 03, 2025, 08:47 AM IST

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29 చిత్రం 120 దేశాల్లో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మాహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29(వర్కింగ్ టైటిల్). ఆఫ్రికా అడవుల నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ గ్లోబ్ ట్రోటర్ చిత్రం 2027లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ఈ మూవీ విషయంలో చాలా సీక్రెసీ మైంటైన్ చేస్తున్నారు. 

25

ఇటీవల మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ముఖం కనిపించకుండా ప్రీ లుక్ రిలీజ్ చేసి నవంబర్ అప్డేట్ అని ఊరించారు. ఈ చిత్ర నేపథ్యం గురించి సోషల్ మీడియాలో రూమర్స్ రావడమే తప్ప జక్కన్న ఎలాంటి విషయం అధికారికంగా చెప్పలేదు. ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఒక సూపర్ హీరో తరహాలో కనిపించబోతున్నారట. దీనికి తోడు ఈ చిత్రంలో హిందూ పురాణాలకి సంబంధించిన నేపథ్యం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

35

ప్రస్తుతం కెన్యాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. 1000 కోట్ల బడ్జెట్ లో భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ కోసం రాజమౌళి కెన్యా నుంచే మార్కెటింగ్ స్ట్రాటజీ మొదలు పెట్టేశారు. తన సినిమాకి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో, ఎలా పబ్లిసిటీ చేయాలో జక్కన్నకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. 

45

తాజాగా రాజమౌళి, ఎస్ఎస్ఎంబీ 29 చిత్ర యూనిట్ తో కలిసి కెన్యా ప్రైమ్ క్యాబినెట్ సెక్రటరీ ముసలియా ముదవాడితో మీట్ అయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి ఆయనకి ఎస్ఎస్ఎంబీ 29 విశేషాలు, తెరకెక్కిస్తున్న విధానం, రిలీజ్ ప్లాన్ గురించి తెలిపారు. ముసలియా ముదవాడి రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచంలో గొప్ప దర్శకులలో రాజమౌళి ఒకరు అంటూ ముసలియా రాజమౌళిని ప్రశంసించారు. 

55

ఆయన పోస్ట్ చేస్తూ.. ప్రపంచంలోనే గొప్ప దర్శకులలో ఒకరైన రాజమౌళికి కెన్యా వేదిక కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా సినిమాలు చేసే దర్శకుడు ఆయన. రెండు దశాబ్దాల నుంచి దర్శకుడిగా రాణిస్తున్న రాజమౌళి.. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే కథనంతో సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సినిమా చేస్తారు. అలాంటి దర్శకుడు తన 120 మంది సిబ్బందితో కలిసి తన చిత్రం కోసం కెన్యాని వేదికగా ఎంచుకున్నారు.  ఆఫ్రికా నేపథ్యంలో సాగే సన్నివేశాలు 95 శాతం వరకు కెన్యాలోని పూర్తి చేయనున్నారు. ఈ మూవీలో ఆసియాలోనే అత్యంత భారీ చిత్రంగా నిలవనుంది. 120 దేశాల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అని ముసలియా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ మీటింగ్ తో ప్రపంచ స్థాయిలో ఎస్ఎస్ఎంబీ 29 చిత్రానికి పబ్లిసిటీ మొదలైంది అని చెప్పొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories