వెంకటేష్ కోసం చిరంజీవి చేసిన పని వల్ల మరో హీరోకి అన్యాయం ?.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ మూవీ ఏంటంటే..

Published : Sep 03, 2025, 07:19 AM IST

వెంకటేష్ నటించిన ఒక సూపర్ హిట్ చిత్రం వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉందని తెలుసా ? చిరంజీవి చేసిన పని వల్ల మరో హీరోకి అన్యాయం జరిగింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరికీ కొన్ని మెమొరబుల్ హిట్ సినిమాలు ఉంటాయి. విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.  అప్పట్లో వెంకీ మాస్ చిత్రాలు చేస్తూనే ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కూడా నటించారు. వెంకటేష్ కెరీర్ లో సంచలనం సృష్టించిన చిత్రాలలో చంటి ఒకటి. ఇది తమిళంలో తెరకెక్కిన చిన్న తంబి చిత్రానికి రీమేక్ గా రూపొందింది. రవి రాజా పినిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు.

25

అయితే చంటి చిత్రం వెంకటేష్ కి రావడానికి చాలా పెద్ద కథ ఉంది. చిన్న తంబి తమిళ చిత్రం గురించి తెలుసుకున్న కేఎస్ రామారావు దీనిని రాజేంద్రప్రసాద్ తో తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. రవి రాజా పినిశెట్టి రాజేంద్రప్రసాద్ కి కథ కూడా చెప్పి ఒప్పించారు. రాజేంద్ర ప్రసాద్ చంటి చిత్రంలో హీరోగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అనేది వాళ్ళిద్దరి నమ్మకం.

35

తమిళంలో చిన్న తంబి మూవీ రిలీజ్ మంచి హిట్ అయింది. ఆ చిత్రం గురించి తెలుసుకున్న నిర్మాత డి రామానాయుడు కే ఎస్ రామారావు ని పిలిచి ఈ చిత్రాన్ని వెంకటేష్ తో చేయమని అడిగారు. సురేష్ బాబు కూడా చంటి చిత్రాన్ని వెంకటేష్ తో చేయాలని కోరారు.

45

కేఎస్ రామారావు ఈ విషయాన్ని రవి రాజా పినిశెట్టికి చెప్పారు. రవి రాజా పినిశెట్టి ఏమాత్రం అంగీకరించలేదు. ఆల్రెడీ ఒక హీరోకి మాటిచ్చేసిన చిత్రాన్ని మరో హీరోతో ఎలా చేస్తాం. ఇది సరైన పద్ధతి కాదు అన్యాయం చేసినట్లు అవుతుంది అని రవిరాజా పినిశెట్టి అన్నారట. ఆ టైం లో రాజేంద్ర ప్రసాద్ కూడా వరుస హిట్ చిత్రాలతో మంచి జోరు మీద ఉన్నారు. 

55

రవి రాజా పినిశెట్టి ఈ చిత్రాన్ని వెంకటేష్ తో చేయడానికి ఒప్పుకోకపోవడంతో కె ఎస్ రామారావు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దించారు. చంటి చిత్రాన్ని వెంకటేష్ తో  చేసేలా చిరంజీవి ఆయన్ని ఒప్పించారు. చిరంజీవి స్వయంగా అడగడంతో రవి రాజా చెప్పిన అంగీకరించక తప్పలేదు. ఆ విధంగా వెంకటేష్ కి చంటి చిత్రం దక్కింది. వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్స్ లో చంటి ఒకటి. ఆ మూవీలో అమాయకుడిగా వెంకటేష్ నటించిన విధానం ఆడియన్స్ ని విపరీతంగా మెప్పించింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందుగా ఖుష్బూని అనుకున్నారు. ఆమె కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం చేయలేదు. దీంతో అవకాశం మీనాకి దక్కింది.

Read more Photos on
click me!

Recommended Stories