సమంత నటన, అందంతోనే కాకుండా.. సమాజ సేవలోనూ భాగస్వామ్యం చేసుకుంటూ గుర్తింపు తెచుకుంటోంది. తాజాగా ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ 2021 అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని తాజాగా తన అభిమానులతో పంచుకుంది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల తాజ్ దక్కన్ – కోహినూర్ హాల్ లో నిన్న ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా గవర్నర్ తమిలి సై హాజరయ్యారు. అలాగే మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ పాల్గొననున్నారు.
26
మహాత్ముడి ఆశయాలను పెంపొందిస్తూ.. సమాజ సేవ, సామాజిక విలువల అభివృద్ధి, పలు రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులను అందజేశారు. ఈ మేరకు ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ అవార్డులు అందుకునున్న ప్రముఖుల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఉన్నారు.
36
వీరిలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, జయేష్ రంజన్, అంజనీ కుమార్, అజారుద్దీన్, పీవీ సింధు, మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత ఉన్నారు.
46
ఈ సందర్భంగా సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులకు తెలియజేసింది. చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ అవార్డును చూపిస్తూ ఒక ఫొటోను షేర్ చేసింది. దీంతో సినీ ప్రముఖులు, హీరోయిన్లు, ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సమంత వారికి ధన్యవాదాలు తెలుపుతోంది.
56
ఈ సందర్భంగా పలు ఫొటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ యాడ్ చేసింది. ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ 2021' అవార్డును అందుకోవడం గౌరవం ఉంది. ఇది సాంఘిక సంక్షేమ రంగంలో ప్రభుత్వం మా పనిని గుర్తిస్తోంది. ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.’ అంటూ పేర్కొంది సమంత.
66
మరోవైపు సమంత ధరించిన శారీ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ శారీపై ఉన్న డిజైన్ మొత్తం చేతితో వేసినది కావడం ఈ శారీ స్పెషల్. ఇదే విషయాన్ని సమంత కూడా తెలియజేసింది. శారీ ధరించడంతో అందానికే అందం వచ్చినట్టుగా ఉందని నెటిజన్లు పొగుడుతున్నారు.