చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి

Published : Dec 21, 2025, 05:09 PM IST

బిగ్ బాస్ తెలుగు 9లో ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి తప్పలేదు. ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనితో జబర్దస్త్ రోహిణి బిగ్ బాస్ తెలుగు 9 షోపై దుమ్మెత్తిపోశారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ తెలుగు 9 షోలో ముగియబోతోంది. ఇంతలోనే గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన కొన్ని షాకింగ్ అప్డేట్స్ బయటకి వచ్చాయి. బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభమైనప్పటి నుంచి ఇమ్మాన్యుయేల్ విన్నర్ రేసులో ఉంటారని అంతా భావించారు. కానీ చివరి దశకు చేరుకునే సరికి కళ్యాణ్, తనూజ విన్నర్ రేసులో నిలిచారు. ఇమ్ముని వెనక్కి నెట్టేశారు. 

25
నాలుగో స్థానంలో ఇమ్మాన్యుయేల్ 

దీనితో ఇమ్మాన్యుయేల్ కనీసం టాప్ 3లో అయినా ఉంటాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు అది కూడా ఇమ్మాన్యుయేల్ కి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అందుతున్న సమాచారం మేరకు ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మూడవ స్థానానికి డిమాన్ పవన్ చేరుకున్నాడు. ఈ విషయం బయటకి రావడంతో ఇమ్మాన్యుయేల్ అభిమానులు బిగ్ బాస్ షోపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. 

35
జబర్దస్త్ రోహిణి సంచలన వ్యాఖ్యలు 

ఇమ్మాన్యుయేల్ జబర్దస్త్ కొలీగ్స్ కూడా బిగ్ బాస్ షోపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ రోహిణి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ షోపై దుమ్మెత్తి పోస్తూ కామెంట్స్ చేసింది. సీరియస్ గా ఇమ్ము విషయంలో అడియాన్స్, బిగ్ బాస్ టీమ్ ఫెయిల్ అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తో చాలా డిసప్పాయింట్ అయ్యాను. 

45
కష్టపడినా విలువ లేదు 

కష్టపడినా విలువ ఉండదు. కష్టానికి తగ్గ రిజల్ట్ రాదు. మరోసారి ప్రూవ్ అయింది. ఇమ్మాన్యుయేల్ ఈ సీజన్ కి రియల్ విన్నర్ అంటూ రోహిణి పోస్ట్ చేసింది. రోహిణి నిరాశ వ్యక్తం చేయడంలో న్యాయం ఉంది అని ఇమ్ము అభిమానులు అంటున్నారు. 

55
ఇమ్మాన్యుయేల్ వల్లే ఎంటర్టైన్మెంట్ 

సీజన్ 9లో ఇమ్మాన్యుయేల్ వల్లే వినోదం పండింది. తొలి రోజు నుంచి చివరి వరకు ఇమ్మాన్యుయేల్ వినోదం అందిస్తూనే ఉన్నాడు. ఆడియన్స్ ని బాగా నవ్వించాడు అని ఇమ్ము అభిమానులు అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories