మళ్ళీ జబర్దస్త్ కి రోజా? ఫ్యాన్స్ కి పండగే!

Published : Jun 05, 2024, 07:50 AM IST

నటి రోజా జబర్దస్త్ షోకి వస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్నికల్లో ఆమె పరాజయం పొందిన నేపథ్యంలో మరలా బుల్లితెరపై సందడి చేస్తారని అంటున్నారు.   

PREV
15
మళ్ళీ జబర్దస్త్ కి రోజా? ఫ్యాన్స్ కి పండగే!

జబర్దస్త్ కి రోజా పెద్ద ఆకర్షణ. 2013లో జబర్దస్త్ ప్రారంభం కాగా అప్పటి నుండి రోజా జడ్జిగా కొనసాగారు. రోజా-నాగబాబు కాంబినేషన్ సూపర్ హిట్. ఏళ్ల తరబడి వీరు జబర్దస్త్ జడ్జెస్ గా ఉన్నారు. 
 

25

జబర్దస్త్ కమెడియన్స్ తో రోజా మమేకం అయ్యేవారు. జడ్జి సీట్లో కూర్చుని ఆమె వేసే కౌంటర్లు, పంచులు బాగా పేలుతాయి. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ లో రోజా పాత్ర ఎంతగానో ఉంది. ఒక పక్క ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రోజా జబర్దస్త్ జడ్జిగా చేశారు. 

 

35
jabardasth show

మల్లెమాల సంస్థతో విబేధాలు నేపథ్యంలో నాగబాబు జబర్దస్త్ ని వీడాడు. ఆయన స్థానంలో సింగర్ మను వచ్చాడు. చాలా కాలం సింగర్ మను, రోజా జబర్దస్త్ జడ్జెస్ గా వ్యవహరించారు. కాగా రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. 

45

రోజా వెళ్ళిపోయాక ఇంద్రజ ఆ స్థానంలోకి వచ్చింది. చాలా మంది వచ్చారు కానీ ఇంద్రజ మాత్రమే నిలదొక్కుకుంది. నటుడు కృష్ణ భగవాన్ తో పాటు ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కుష్బూ సైతం ఆ సీట్లో కనిపిస్తున్నారు. 

 

55


కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆమె మరలా జబర్దస్త్ కి వస్తారనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. అదే నిజమైతే జబర్దస్త్ కి పూర్వ వైభవం వచ్చినట్లే. జబర్దస్త్ ఒకప్పటి ఆదరణ కోల్పోయిన సంగతి తెలిసిందే. 
 

click me!

Recommended Stories