
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. దాదాపు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. జనసేన అధినేత విజయంపై తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు తెలియచేస్తున్నారు. మరో ప్రక్క తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటారు.
పలువురు సినీ సెలబ్రెటీలు పవన్ ను విష్ చెస్తూ పోస్టులు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ సక్సెస్ పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
“ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ ఇంట్లో ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్ట్ పై నెటిజన్లతోపాటు పవన్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.
మరో ప్రక్క “ఈ అద్భుత విజయంపై పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలుక సేవ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన కృషి, మీ అంకితా భావం, మీ నిబద్ధత ఎప్పటికీ హార్ట్ టచింగ్. ప్రజా సేవలో మీ సరికొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ ” అంటూ బన్నీ పోస్ట్ చేశాడు.
న్యాచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. మిమ్మల్ని ఎంత అనుమానించినా మీరు పోరాటం చేసిన విధానం.. మీరు గెలిచిన తీరు అంతా కేవలం ఒక కథ కాదు. అందరూ నేర్చుకోవాల్సిన పాఠం కూడా. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది సార్.. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని. ప్రతి ఒక్కరికీ రోల్ మోడల్ కావాలని కోరుకుంటున్నారు అంటూ నాని పోస్ట్ చేశారు.
చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గార్లకు కంగ్రాట్స్.. పిఠాపురంలో గొప్ప చరిత్రను సృష్టించారు.. ఆంధ్రాలో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.. అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ వేశాడు.
ఏపీ ప్రజలు మాట్లాడారు.. తీర్పునిచ్చారు.. చంద్రబాబు గారు, బాలయ్య గారు, నారా లోకేష్ గార్లకు.. కంగ్రాట్స్.. పవన్ కళ్యాణ్ గారికి సెలెబ్రేట్ చేసుకునే రోజు వచ్చింది.. ఎప్పుడో రావాల్సిన విజయం ఇది.. ప్రజా ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామని రామ్ అన్నాడు.
అద్భుత విజయం సాధించారు.. ఇక మీ నాయకత్వంలో ఏపీ అనేది అభివృద్దిలో దూసుకుపోతోందనే విషయంలో డౌటే లేదు.. అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణలకు కంగ్రాట్స్ చెప్పాడు మోహన్ బాబు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వేస్తూ.. కంగ్రాట్స్ అని ఫైర్ ఎమోజీలను షేర్ చేశాడు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబులను ట్యాగ్ చేశాడు.
పిఠాపురంలో గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్.. మీ జర్నీ అద్భుతంగా.. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని నిలబడ్డారు.. ఇక మీ ప్రజా సేవ దిగ్విజయంగా సాగాలని, అందరిలోనూ స్పూర్తి నింపాలని కోరుకుంటున్నాను అని రవితేజ అన్నాడు.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజార్టీతో పవన్ విజయాన్ని అందుకున్నారు.
గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మాత్రం తన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా.. కూటమి కూడా విజయం సాధించేలా పావులు కదిపారు. అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి అద్బుతమైన ఫలితాలు వచ్చాయి. నిలబడ్డ ప్రతీ చోటా జనసేన గెలిచింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అన్న మాటలను నిలబెట్టుకున్నాురు. ఎవడ్రా మనల్ని ఆపేది.. బైబై వైసీపీ నినాదాలతో రాష్ట్రమంతా ప్రభావం చూపిన జనసేనాని.. లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల ఓడిపోయి.. ఎన్నో విమర్షలు ఎదుర్కొన్నారు. ఇక ఈసారి మాత్రం పిఠాపురం నుంచి భారీమెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.