బయటికి వచ్చిన ఆర్యని అప్రిషియేట్ చేస్తుంది అంజలి. బ్లడ్ దొరకదేమో అని చాలా టెన్షన్ పడ్డాము కానీ టైం కి వచ్చి బ్లడ్ ఇచ్చావు రియల్లీ గ్రేట్ అంటుంది. ప్రాణం పోసిన అమ్మకి ప్రాణాలు ఇచ్చిన తక్కువే అంటాడు ఆర్య. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా తను చేత్తో నాకు అన్నం పెట్టింది ఆ రుణం తీర్చుకోవాలి కదా అంటాడు ఆర్య.మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు ఇండియా అంటే ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలకు విలువ ఇచ్చే గ్రేట్ కంట్రీ అని. అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుంది.